NTV Telugu Site icon

Indian Aviation Sector: ఆకాశంలో ఆశల హరివిల్లు. రెండో స్థానం కోసం పోటీ ఫుల్లు.

Indian Aviation Sector

Indian Aviation Sector

Indian Aviation Sector: దేశీయ విమానయాన రంగంలో విస్తారా ఎయిర్‌లైన్స్‌ 2వ స్థానానికి ఎదిగింది. 10.4 శాతం మార్కెట్‌ వాటాను కైవసం చేసుకుంది. 58.8 శాతం వాటాతో ఇండిగో తొలి స్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానం కోసం తీవ్ర పోటీ నెలకొంది. స్పైస్‌జెట్‌, గోఫస్ట్‌, ఎయిర్‌ ఇండియా నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఆక్యుపెన్సీ విషయంలో స్పైస్‌జెట్‌ ఫస్ట్‌ ప్లేస్‌లో ఉంది. స్పైస్‌జెట్‌ 84.7 శాతం ఆక్యుపెన్సీని ఆక్రమించింది. విస్తారా 84.3 శాతం ఆక్యుపెన్సీతో రెండో స్థానంలో ఉంది. జులైలో మొత్తమ్మీద అన్ని ఎయిర్‌లైన్స్‌లోనూ కలిపి 97 లక్షల మందికి పైగా ప్రయాణం చేశారు. ఈ వివరాలను డీజీసీఏ వెల్లడించింది.

రూ.280 కోట్ల సమీకరణ

ఎడ్‌టెక్‌ స్టార్టప్‌ సన్‌స్టోన్‌ ఫండ్‌ రైజింగ్‌ చేపట్టింది. వెస్ట్‌బ్రిడ్జ్‌ క్యాపిటల్‌ నుంచి రూ.280 కోట్లు సమీకరించింది. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ పైన ఫోకస్‌ పెట్టిన సన్‌స్టోన్‌.. ఈ నిధులను కొత్త ప్రోగ్రామ్స్‌ విస్తరణ కోసం వినియోగించనుంది. ముఖ్యంగా యూజీ టెక్నాలజీ ప్రోగ్రామ్స్‌పై దృష్టిసారించినట్లు సన్‌స్టోన్‌ ఫౌండర్లు అశిష్‌ ముంజాల్‌, పీయూష్‌ నింగ్రు తెలిపారు. కాగా.. ఈ ఫండ్‌ రౌండ్‌కి ‘అల్టెరియా’ కూడా హాజరు అయింది.

IRCTC Fund raising: ప్రయాణికుల డేటాతో వెయ్యి కోట్లు.. ఐఆర్‌సీటీసీ ఫండ్‌ రైజింగ్‌ ప్లాన్‌.

3వ పెద్ద మార్కెట్‌గా రష్యా

చైనా కరెన్సీ యువాన్‌ లావాదేవీలకి 3వ పెద్ద మార్కెట్‌గా రష్యా ఎదగటం గమనార్హం. చైనా బయట ఆ దేశ కరెన్సీకి ఆదరణ లభిస్తోందనటానికి ఇదే నిదర్శనం.
డాలర్‌, యూరోలపై ఆంక్షల ప్రభావం యువాన్‌కి కలిసొచ్చింది. ప్రపంచంలోని మొత్తం యువాన్‌ ట్రాన్సాక్షన్లలో రష్యా కంపెనీల, బ్యాంకుల భాగస్వామ్యం 4% శాతానికి చేరింది. జులై నెల ఫలితాలను రాయిటర్స్‌ స్విఫ్ట్‌ డేటా వెల్లడించింది.

స్టాక్‌ మార్కెట్‌ అప్‌డేట్‌

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఏకంగా 789 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్‌ 59508 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
185 పాయింట్లు తగ్గిన నిఫ్టీ 17771 వద్ద కొనసాగుతోంది. ప్యాసింజర్‌ డేటాతో వెయ్యి కోట్ల నిధులు సమీకరించనున్నట్లు ఐఆర్‌సీటీసీ ప్రకటించటంతో ఆ సంస్థ షేర్లు 4 శాతం లాభపడ్డాయి. టాటా కెమికల్స్‌ షేర్ల విలువ నెల రోజుల్లో 38% పెరిగింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 79.27 వద్ద నిలకడగా ఉంది.