Site icon NTV Telugu

CAG Report: 10 ఏళ్లలో భారీగా పెరిగిన రాష్ట్రాల అప్పులు.. మొదటి స్థానంలో ఏ రాష్ట్రం ఉందంటే..?

Cag

Cag

CAG Report: భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ. ఇటీవల, జపాన్‌ను అధిగమించి ప్రపంచవ్యాప్తంగా నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. రాబోయే 2.5 నుంచి 3 సంవత్సరాలలో జర్మనీని అధిగమించే అవకాశం ఉందని నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం ఇటీవల అంచనా వేశారు. కానీ.. అప్పులు కుప్పలు సైతం అంతే వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశంలోని 28 రాష్ట్రాల ఉమ్మడి అప్పు గత దశాబ్దంలో మూడు రెట్లు పెరిగిందని తాజాగా కాగ్ రిపోర్టులో వెల్లడైంది. 2013–14లో ₹17.57 లక్షల కోట్ల నుంచి 2022–23 నాటికి ₹59.60 లక్షల కోట్లకు పెరిగిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) తాజా నివేదిక తెలిపింది.

READ MORE: చేపలు తినడంతో గుండె నుండి మెదడు వరకు ఆరోగ్య రక్ష అని తెలుసా ?

రాష్ట్రాల ఆర్థిక పరిస్థిపై దశాబ్దంగా చేసిన సమీక్షను శుక్రవారం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శుల సమావేశంలో కంప్ట్రోలర్ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) చీఫ్‌ కె. సంజయ్ మూర్తి సమర్పించారు. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి, రాష్ట్రాల మొత్తం ప్రజా అప్పు – అంతర్గత రుణాలు, కేంద్రం నుంచి వచ్చిన రుణాలు సహా – ₹59,60,428 కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది. ఇది వాటి మొత్తం స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP)లో 22.96%. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర అప్పు ₹17,57,642 కోట్లు లేదా స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో 16.66%గా ఉండేది. కానీ.. 2022-23 ఆర్థిక ఏడాదిలో అప్పు 3.39 రెట్లు పెరిగి GSDPలో 16.66 శాతం నుంచి 22.96 శాతానికి పెరిగిందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.

READ MORE: Kanthara-1 : రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా కాంతార-1 ట్రైలర్..

రాష్ట్రాల విషయానికి వస్తే.. 2022–23 చివరి నాటికి.. దేశంలోనే అప్పుల్లో టాప్‌ ప్లేస్ లో ఉంది పంజాబ్‌. ఆ రాష్ట్రం జీఎస్‌డీపీలో అప్పులు 40.35% ఉన్నాయి. ఇక జీఎస్‌డీపీలో నాగాలాండ్ 37.15%, పశ్చిమ బెంగాల్ 33.70%తో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు, ఒడిశా 8.45%తో కనిష్ట నిష్పత్తిని నమోదు చేయగా, మహారాష్ట్ర 14.64%, గుజరాత్ 16.37%తో కొనసాగుతున్నాయి. మార్చి 31, 2023 నాటికి, ఎనిమిది రాష్ట్రాలు వాటి జీఎస్‌డీపీలో 30% కంటే ఎక్కువ రుణ స్థాయిలను కలిగి ఉన్నాయి. ఆరు రాష్ట్రాలు 20% కంటే తక్కువగా ఉన్నాయి. మిగిలిన 14 రాష్ట్రాలు 20%, 30% మధ్య ఉన్నట్లు కాగ్ విశ్లేషణ తెలిపింది.

READ MORE: Vijay: రాజీవ్ గాంధీ హంతకుడిపై యాక్టర్ విజయ్ ప్రశంసలు.. ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ గురించి ఏమన్నారంటే.

అసలు జీఎస్‌డీపీ అంటే ఏంటి?
దేశానికి జీడీపీ మాదిరిగా రాష్ట్రానికి జీఎస్‌డీపీ ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, పురోగతిని తెలియజేస్తుంది. దేశంలో సంవత్సర కాలంలో జరిగిన అన్ని రకాల వస్తు, సేవల ఉత్పత్తి విలువను లెక్కకట్టినట్లే రాష్ట్ర స్థాయిలోనూ గణించి వృద్ధి రేటును ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రగతికి ప్రామాణిక సూచీ అయిన జీఎస్‌డీపీ లెక్కింపులో పరిగణనలోకి తీసుకునే అంశాలు, పాటించే విధానాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి సంవత్సరాల్లో నమోదైన వృద్ధి రేట్లు, రంగాలవారీగా ఉన్న అభివృద్ధి తీరుతెన్నులు, సంబంధిత గణాంకాలను అర్థం చేసుకోవాలి. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో రాష్ట్ర భౌగోళిక సరిహద్దుల్లో ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తువులు, సేవల విలువను స్థూల రాష్ట్ర ఉత్పత్తి (జీఎస్‌డీపీ) అంటారు. దీన్నే జీవీఏ (స్థూల జోడింపు విలువ) అని కూడా పేర్కొంటారు. ఏప్రిల్‌ 1న ప్రారంభమై మార్చి 31తో ముగిసే 12 నెలల కాలాన్ని ‘ఆర్థిక సంవత్సరం’గా వ్యవహరిస్తారు.

Exit mobile version