Site icon NTV Telugu

iPhone 17 Series: ఐఫోన్ 17 సిరీస్ స్పెసిఫికేషన్స్ లీక్.. కొత్త ఫీచర్లపై భారీ అంచనాలు!

Iphone

Iphone

iPhone 17 Series: యాపిల్ కంపెనీ తన వార్షిక ‘అవే డ్రాపింగ్’ ఈవెంట్‌ను సెప్టెంబర్ 9వ తేదీన నిర్వహించనున్నట్లు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న ఐఫోన్ 17 సిరీస్, కొత్త వెర్షన్ యాపిల్ వాచ్, అప్డేటెడ్ ఎయిర్‌పాడ్స్ తో పాటు వివిధ రకాల యాక్సెసరీస్‌ను ఆ సంస్థ ఆవిష్కరించనుంది. అయితే, ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 ప్రో మాక్స్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ఎయిర్, బేసిక్ ఐఫోన్ 17 అనే నాలుగు వేరియంట్లను రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో థర్మల్ కెమెరా ఇమేజ్ వంటి స్టైల్‌లో ప్రత్యేక లోగోను కూడా యాపిల్ కంపెనీ షేర్ చేసింది. కాగా, కొత్త ఐఫోన్ కి సంబంధించిన వివరాలు కొన్ని లీక్ అయ్యాయి.

Read Also: Lashkar Terror Activities: ఆపరేషన్ సింధూర్ శిథిలాలను కూల్చిన ఉగ్రవాదులు.. లష్కర్ ఎ తోయిబా ప్లాన్ ఏంటి!

కొత్త ఐఫోన్‌లో ప్రత్యేకతలు
చాలా ఏళ్ల తరువాత యాపిల్ తన ఐఫోన్ డిజైన్‌లో పెను మార్పులు చేయనుందని లీక్ లో తేలింది. తాజా వివరాల ప్రకారం, కొత్త ఐఫోన్ గత వెర్షన్ కంటే 5.5 మిల్లీమీటర్లు సన్నగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఇటీవల మార్కెట్లోకి వచ్చిన సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ కంటే కూడా చాలా సన్నగా ఉంటుందని బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకటించింది. అలాగే, ఈ సిరీస్‌లో USB-C పోర్ట్, ప్రోమోషన్ సపోర్ట్, 6.6 ఇంచెస్ స్క్రీన్, అద్భుతమైన కెమెరా సెటప్ లాంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.

Read Also: Dammu Srija : నెలకు లక్ష జీతం.. దమ్ము శ్రీజ గురించి షాకింగ్ నిజాలు

కొత్త రంగులు, శక్తివంతమైన బ్యాటరీ
ఐఫోన్ 17 సిరీస్‌లో రెండు కొత్త కలర్స్‌ను పరిచయం చేసే ఛాన్స్ ఉందని టాక్. ఇవి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఐఫోన్ 16 సిరీస్ రంగుల కంటే చాలా ఆకర్షణీయంగా ఉంటాయని సమాచారం. ఇక, బ్యాటరీ సామర్థ్యం విషయానికి వస్తే, కొత్త మోడల్స్‌లో 5000 mAh బ్యాటరీ ఉండనున్నట్లు తెలుస్తుంది.

ధరలపై అంచనాలు
ఐఫోన్ 17 సిరీస్ ధరలు రూ. 89,900 నుంచి రూ. 1.64 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే, లాంచ్ ఈవెంట్ సమయంలోనే యాపిల్ అధికారిక ధరలను ప్రకటించే ఛాన్స్ ఉంది. నుంది. కాగా, మొత్తం మీద ఐఫోన్ 17 సిరీస్ లీక్ సమాచారంతో అభిమానుల్లో కొత్త ఫీచర్లపై మరింత ఆసక్తి పెరిగింది.

Exit mobile version