Site icon NTV Telugu

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 1,544 బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్

Jobs

Jobs

ఇండస్ట్రియల్​ డెవలప్‌మెంట్​బ్యాంక్​ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్​మేనేజర్​ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్​విడుదల చేసింది. ఆయా విభాగాల్లో మొత్తం 1,544 ఖాళీలు ఉన్నట్లు ఐడీబీఐ వెల్లడించింది. 1044 ఎగ్జిక్యూటివ్ పోస్టులు, మరో 500 అసిస్టెంట్​ మేనేజర్ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు ఐటీబీఐ ప్రకటించింది. 20-25 ఏళ్ల వయస్సువారు ఎగ్జిక్యూటివ్​, 21-28 ఏళ్ల వయస్కులు అసిస్టెంట్​మేనేజర్​ పోస్టులకు అర్హులు అని తెలిపింది.

Health Tips: బట్టతలపై తిరిగి జుట్టు పెరగాలా? ఈ చిట్కాలు పాటించండి

ఆయా ఉద్యోగాలకు జూన్ 3న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అవుతుందని ఐడీబీఐ వెల్లడించింది. ఈ ఉద్యోగాలకు అర్హత డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌గా నిర్ణయించినట్లు తెలిపింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.200 అని.. ఇతరులకు రూ.వెయ్యి దరఖాస్తు ఫీజు అని పేర్కొంది. దరఖాస్తుల సమర్పించేందుకు జూన్ 17 చివరి తేదీ అని, జూలై 7న అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని ఐడీబీఐ చెప్పింది. కాగా ఎగ్జిక్యూటివ్​ పోస్టుకు ఎంపికైన వారికి మొదటి సంవత్సరం నెలకు రూ. 29 వేల చొప్పున వేతనం చెల్లిస్తారు. అసిస్టెంట్​మేనేజర్లకు సంవత్సరం శిక్షణ కాలం పూర్తయిన అనంతరం నెలకు రూ.36 వేల నుంచి వేతనం ప్రారంభం అవుతుంది.

Exit mobile version