NTV Telugu Site icon

Arunish Chawla: కేంద్ర రెవెన్యూ కార్యదర్శిగా చావ్లా నియామకం

Arunishchawla

Arunishchawla

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొత్త రెవెన్యూ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరుణిష్ చావ్లా నియమితులయ్యారు. చావ్లా ప్రస్తుతం రసాయనాలు మరియు ఎరువుల మంత్రిత్వ శాఖలో ఫార్మాస్యూటికల్స్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. చావ్లా బీహార్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియామకం తర్వాత రెవెన్యూ కార్యదర్శి పదవి ఖాళీ అయింది. అనంతరం ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్‌ సేథ్‌కు రెవెన్యూ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు రెవెన్యూ కార్యదర్శిగా చావ్లా బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతలు స్వీకరించే వరకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు కూడా చావ్లా నిర్వహిస్తారని మంత్రివర్గ నియామకాల కమిటీ బుధవారం నోటిఫికేషన్‌లో తెలిపింది. మూడేళ్ల కాలానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ఆయన ఖాళీ వెళ్లిన పోస్టులో అరుణిష్ చావ్లా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఇక చావ్లా స్థానంలో కొత్త ఫార్మాస్యూటికల్స్ సెక్రటరీగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమిత్ అగర్వాల్ నియమితులయ్యారు. ఇక మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వినీత్ జోషి… ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జోషి.. గత ఏడాది మేలో మణిపూర్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. విద్యా మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉన్నత విద్యా శాఖలో అదనపు కార్యదర్శిగా ఆయన పనిచేశారు. జౌళి శాఖ కార్యదర్శి రచనా షాను డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ సెక్రటరీగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

Show comments