NTV Telugu Site icon

Urban Terrain Bolt Cycle: ఆఫర్ ఆదిరింది.. రూ. 20 వేలు విలువ చేసే సైకిల్ రూ. 6 వేలకే!

Urban Terrain Bolt Cycle

Urban Terrain Bolt Cycle

సైకిల్ ఇది ఒకప్పుడు సామాన్యుడి బైక్. రాను రాను బైక్స్, స్కూటర్లు అందుబాటులోకి రావడంతో సైకిళ్ల వినియోగం తగ్గిపోయింది. కానీ, ప్రస్తుత రోజుల్లో మళ్లీ సైకిల్ వాడే వారు ఎక్కువవుతున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం సైక్లింగ్ చేస్తున్నారు. సైకిల్ తొక్కడం వల్ల బాడీ ఫిట్ గా ఉంటుంది. శరీర కండరాలు దృఢంగా మారుతాయి. వైద్యులు కూడా సైకిల్ తొక్కడాన్ని వ్యాయామంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో సైకిళ్ల వినియోగం పెరిగింది. మార్కెట్ లో సాధారణ సైకిల్స్ తో పాటు, ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా లభ్యమవుతున్నాయి. మీరు సైక్లింగ్ కోసం బెటర్ సైకిల్ కావాలనుకుంటే ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో అదిరిపోయే సైకిల్ అందుబాటులో ఉంది.

Urban Terrain Bolt Cycleపై కళ్లు చెదిరే ఆఫర్ ప్రకటించింది.ఏకంగా 65 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. రూ.20 వేలు విలువ చేసే ఈ సైకిల్ ను కేవలం రూ. 6,832కే దక్కించుకోవచ్చు. ఈ సైకిల్ లుక్ పరంగా ఆకట్టుకుంటోంది. క్వాలిటీ స్టీల్ ఫ్రేమ్ తో రూపొందించబడింది. 15 ఏళ్లు పైబడిన వారికి ఈ సైకిల్ అనుకూలంగా ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ తో వస్తుంది. అడ్జస్టబుల్ సీట్, మడ్ గార్డ్ ను కూడా అమర్చారు. డిస్క్ బ్రేక్స్ తో వస్తుంది. డబుల్ వాల్ అల్లోయ్ రిమ్స్ తో వస్తుంది. లైట్ వెయిట్ స్టీల్ ఫ్రేమ్ అందించారు. ఇది సింగిల్ స్పీడ్ తో కూడిన నాన్ గేర్డ్ సైకిల్.

అర్బన్ టెర్రైన్ బోల్ట్ UT5000S27.5 మౌంటెన్ బైక్ అనేది రైడింగ్ ఎక్సపీరియన్స్ కోసం అత్యుత్తమమైనది. ఇది అధిక నాణ్యత, చాలా బలమైన తేలికపాటి స్టీల్‌తో తయారు చేయబడింది. 27.5 అంగుళాల వీల్ సైజ్ తో వస్తుంది. అత్యుత్తమ డిస్క్ బ్రేక్‌లు అన్ని పరిస్థితులలోనూ రైడింగ్‌కు అనువైనవిగా ఉంటాయి. సైకిల్ 85% అసెంబుల్డ్ కండిషన్‌లో డెలివరీ చేస్తారు. ప్యాకేజింగ్‌లో అందించిన టూల్ కిట్‌తో మీరు సైకిల్‌ను సులభంగా అసెంబుల్ చేసుకోవచ్చు.

Show comments