How To Recover Money From Friends: ఈ రోజుల్లో చాలా స్నేహాలు డబ్బుల కారణంగానే దూరం అవుతున్నాయి. ఆపద సమయంలో మిత్రుడికి సాయంగా డబ్బులు సర్దుబాటు చేస్తే.. వాటిని తిరిగి ఇచ్చే సమయంలో అనేక ఇబ్బందులు పెట్టడంతో పాటు మైత్రి కూడా చెడిపోతుంది. ఎంతైనా దోస్తానాలో డబ్బులు అనేది చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సిన విషయం అని అంటున్నారు. సరే మీరు ఎప్పుడైనా పొరపాటున మీ దోస్తులకు డబ్బులు ఇచ్చి తిరిగి రావడం లేదని బాధపడ్డారా. చూడండి ఈ రోజుల్లో చాలా మంది స్నేహితులు ఇచ్చిన డబ్బులు తిరిగి అడగటానికి చాలా మొహమాటపడటం లాంటివి చేస్తుంటారు. అటువైపు కొందరు తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా సతాయించడం లాంటి చేస్తుంటారు. ఇంతకీ డబ్బు ఇచ్చిన వాళ్లు తిరిగి వాటిని ఎలా రికవరీ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Deepika Padukone : మగాడిలా ఉన్నావన్నారు.. దీపిక ఎమోషనల్..
న్యాయంగా కష్టపడి సంపాదించుకున్న డబ్బులను అదే న్యాయంగా తిరిగి సంపాదించుకునే పద్ధతులు కొన్ని ఇప్పుడు చూద్దాం. మీకు తెలుసా ఇచ్చిన డబ్బులను తిరిగి తీసుకునేందుకు లీగల్ ఆప్షన్స్ ఉన్నాయని. సరేసరే కోర్టులకు వెళ్లడం, కేసులు పెట్టడం లాంటివి చాలా పెద్ద తలకాయ్ నొప్పి అని అనుకుంటున్నారా.. అదేం లేదంటున్నారు.. నిపుణులు. ఏదైనా కరెక్ట్‌గా చేస్తే ఎక్కడ ఇబ్బందులు తలెత్తవని చెబుతున్నారు.
క్రిమినల్ కేసు పెట్టండి: డబ్బులు అప్పుగా తీసుకున్న వ్యక్తి ఎంతకీ తిరిగి ఇచ్చే పరిస్థితి కనిపించని పక్షంలో.. చేసేది ఏం లేదని ఆగిపోకండి. ఆయన మీ దగ్గర డబ్బులు మోసపూరితంగా తీసుకున్నాడని బలమైన సాక్ష్యాధారాలతో నిరూపించగలను అని నమ్మకం ఉంటే.. తక్షణం ఆ వ్యక్తిపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు ఫైల్ చేయొచ్చు తెలుసా.
లీగల్ నోటీస్ పంపించడం: ఇచ్చిన డబ్బులు రిటన్ చేయమని అడిగితే.. మీ దోస్తు పట్టించుకోనప్పుడు ఫస్ట్ ఒక లాయర్ ద్వారా మీవోడికి లీగల్ నోటీస్ పంపించాలి. ఇందులో మీరు మీ ఫ్రెండ్‌కు ఎంత అప్పు ఇచ్చారు, తిరిగి ఎప్పుడు ఇస్తానని ఆయన ఒప్పుకున్నారు, డబ్బు తిరిగి చెల్లించేందుకు డెడ్‌లైన్ వంటి వివరాలను స్పష్టంగా ప్రస్తావించాలి. ఇది మీకొక అఫీషియల్ రికార్డ్‌గా పని చేయడంతో పాటు, మీ ఫ్రెండ్ ఈ నోటీస్ చూసిన తర్వాత.. డబ్బు రిటన్ చేసే ఛాన్స్‌లను పెంచుతుంది.
సివిల్ కేసు ఫైల్ చేయవచ్చు: లీగల్ నోటీసులను పట్టించుకోకపోతే అప్పుడు మనోడిపై ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కింద సివిల్ కేసు దాఖలు చేయొచ్చు. ఇక్కడ విశేషం ఏమింటే మీరు మీ ఫ్రెండ్‌కు డబ్బులు ఇచ్చినట్లు కోర్టులో సరైన సాక్ష్యాల్ని సమర్పించాల్సి ఉంటుంది. మీరు కోర్టు ముందుకు ఏ సాక్ష్యాల్ని తీసుకొస్తారో గుర్తు పెట్టుకొని సివిల్ కేసు ఫైల్ చేయడానికి ప్రయత్నించండి. కోర్టు మీ వాదనలు విన్న తర్వాత మనోడి నుంచి మీ డబ్బు తిరిగి చెల్లించాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తుంది.
సివిల్ సూట్: మీ దగ్గర అప్పు ఇచ్చినదానికి సంబంధించి అగ్రిమెంట్ లేదా ఐఓయూ ఉన్నట్లయితే.. సివిల్ ప్రొసీజర్ కోడ్ (CPC) ఆర్డర్ 37 కింద సమ్మరీ సివిల్ కేసు ఫైల్ చేయొచ్చు. ఇది చాలా తక్కువ సమయంలో పరిష్కారం అయ్యే ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు.
చెక్ బౌన్స్ అయితే: ఒకవేళ మీ ఫ్రెండ్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయితే.. అప్పుడు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద కేసు పెట్టొచ్చు. ఇక్కడ కూడా సమస్య తొందరగానే కొలిక్కివస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. మీ కేసు ఎంత బలమైందో నిరూపించేందుకు సరైన సాక్ష్యాలు ఉండాలి. మీరు మీ ఫ్రెండ్‌కు బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బు ట్రాన్స్‌ఫర్ చేసి ఉంటే.. ఆ ట్రాన్సాక్షన్ స్లిప్స్, బ్యాంక్ స్టేట్‌మెంట్స్ గట్టి సాక్ష్యాలుగా పనిచేస్తాయి. మీరు ఏదైనా ఒప్పంద పత్రం లేదా ప్రామిసరీ నోట్ రాస్కొని ఉంటే.. ఇవి కూడా కీలకంగా మారుతాయి.
గతంలో నిర్వహించిన ఓ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 27 శాతం మంది స్నేహితులు మాత్రమే తీసుకున్న డబ్బును తిరిగి ఇస్తారట. 73 శాతం మంది మింగేస్తారట. అలా మింగేసే వారిని వదిలి పెట్టకూడదని అంటే పైన చెప్పినవి కచ్చితంగా పాటించాలని అంటున్నారు నిపుణులు.
READ ALSO: Supreme Court: ఈసీ తప్పు చేస్తే మొత్తం ప్రక్రియను రద్దు చేస్తాం..
