Site icon NTV Telugu

How To Earn ₹1 Crore: కోటి రూపాయలు సంపాదించడానికి సింపుల్‌గా ఇలా చేయండి…

How To Earn 1 Crore

How To Earn 1 Crore

How To Earn ₹1 Crore: చాలా మంది మధ్యతరగతి, పేద ప్రజల కల వారి జీవిత కాలంలో కుదిరితే కోటి రూపాయలు సంపాదించడం అనేది. సరే నిజానికి కోటి రూపాయలు సంపాదించడానికి మీకు ఎన్నేళ్లు పడుతుంది. నాకు తెలిసి జీవితకాలం. కానీ కొన్ని ఉదాహరణతో మీరు కోటి రూపాయలు సంపాదించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Naga Vamsi: మీనాక్షి నా బుర్ర తినేసేది.. నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఉదాహరణకు మీ జీతం ఇప్పుడు రూ. 40 వేలు అయితే.. మీరు రిటైర్ అయ్యే స్టేజ్‌కి మీ జీతం రూ.1.50 లక్షలు అవుతుంది. ఈ మొత్తంలో 30% ఆదా చేస్తే మీరు పదవీ విరమణ చేసే సమయానికి సుమారుగా రూ.71 లక్షలు సేవ్ చేసుకోగలరు. ఇదే మీరు మీ రిటైర్‌మెంట్ టైం వరకు ఉండే సర్వీస్ అంటే.. సుమారుగా 25 ఏళ్లు పొదుపు చేసిన డబ్బును SIP రూపంలో మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెడితే మీకు ఎంత డబ్బు వస్తుందో తెలుసా.. మ్యూచువల్ ఫండ్ 25 ఏళ్లలో 8% CAGR వద్ద పెరిగితే అది రూ.1.82 కోట్లు అవుతుంది. నేడు చాలా మ్యూచువల్ ఫండ్లు లాంగ్ టైంలో కనీసం 8% గ్రో అవుతున్నాయి. ఒక వేళ మీరు పెట్టిన మ్యూచువల్ ఫండ్ 10% వృద్ధి చెందితే, మీ పెట్టుబడి 25 ఏళ్లలో రూ. 2.33 కోట్లుగా రిటన్స్ వస్తాయి.

ఒక వేళ మీరు రూ.10 వేలతో 10 సంవత్సరాలకు సిప్‌ స్టార్ట్ చేస్తే రూ.1 కోటి కూడబెట్టడం అనేది అసాధ్యం. ఎందుకంటే మీరు చేసే పొదుపు ఏడాదికి 30% పెరిగినా, అది 10 ఏళ్లలో రూ.1 కోటికి చేరడం సాధ్యం కాదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. 10 ఏళ్లలో రూ.1 కోటి చేరుకోవడానికి మీరు నెలకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు పెట్టుబడి పెట్టవలసి రావచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మీరు పెట్టే పెట్టుబడి ఏడాదికి 12% రేటుతో వృద్ధి చెందితే, నెలకు రూ.44,700 SIP ద్వారా 10 ఏళ్లలో రూ. 1 కోటి చేరుకోవచ్చని పేర్కొన్నారు. మీ పెట్టుబడి 10% పెరిగితే, మీరు 10 ఏళ్లలో రూ. 1 కోటి సంపాదించడానికి నెలకు రూ. 49,700 పెట్టుబడి పెట్టవలసి ఉంటుందని వెల్లడించారు.

READ ALSO: Peddi: ‘పెద్ది’ ఓటీటీ డీల్ క్లోజ్.. కళ్లు చెదిరే ధరకు డిజిటల్ రైట్స్!

Exit mobile version