Site icon NTV Telugu

Honda Activa EV: త్వరలో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్.. టీజర్ విడుదల

Honda

Honda

ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా నుంచి ఎలక్ట్రిక్ వాహనం ఎంట్రీ ఇవ్వబోతుంది. త్వరలో విద్యుత్‌ స్కూటర్‌ను లాంచ్‌ చేయబోతున్నట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన టీజర్‌ను తాజాగా విడుదల చేసింది. హోండా యాక్టివా మోడల్‌లోనే విద్యుత్‌ స్కూటర్‌ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ విడుదల చేసిన టీజర్‌‌లో ముందు భాగం కనిపించింది. పాత మోడల్‌నే ఈవీ రూపంలో తీసుకొస్తున్నట్లు కనబడుతుంది.

ఇది కూడా చదవండి: POCO X7 : మిడ్ రేంజ్‭లో హైపర్‌ఓఎస్ 2.0 ఓఎస్‌తో మొదటి మొబైల్ ఇదే

ప్రస్తుతం దేశంలో ఓలా ఎలక్ట్రిక్‌, అంకుర సంస్థలు విద్యుత్‌ స్కూటర్ల విభాగంలో దూసుకెళ్తున్నాయి. మరోవైపు బజాజ్‌, టీవీఎస్‌ సంస్థలు చేతక్‌, ఐక్యూబ్‌ మోడళ్లతో మెరుగైన విక్రయాలు నమోదు చేస్తున్నాయి. హీరో మోటోకార్ప్‌ సంస్థ విడా పేరిట విద్యుత్‌ స్కూటర్‌ను తీసుకొచ్చింది. ఈ క్రమంలో హోండా నుంచి కూడా త్వరలోనే విద్యుత్‌ స్కూటర్‌ను తీసుకురాబోతోందంటూ వార్తలు వినిపించాయి. అన్నట్టుగానే కంపెనీ నుంచి టీజర్ వచ్చేసింది. త్వరలోనే మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

 

Exit mobile version