Site icon NTV Telugu

GST on gaming: ఆన్‌లైన్‌ గేమ్స్‌పై జీఎస్టీ.. షాకిచ్చిన కేంద్రం..!

Gst

Gst

అక్రమంగా అన్నింటిని జీఎస్టీ పరిధిలోకి తెస్తోంది సర్కార్‌.. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అన్ని వస్తువుల ధరలు పెరిగిపోయాయంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఏ షాపుకు వెళ్లినా.. జీఎస్టీ ఇంత శాతం అంటూ బోర్డులు దర్శనమిస్తున్నాయి.. అదేస్థాయిలో వసూలు చేస్తున్నారు. ఇక, జీఎస్టీ నుంచి తప్పించుకోవడానికి బిల్లులు లేకుండా లావాదేవీలు సాగించేవారు కూడా ఉన్నారని చెబుతుంటారు. ఇక, కేంద్రం ఆన్‌లైన్‌ గేమింగ్‌ ప్రియులకు కూడా షాకిచ్చేందుకు సిద్ధం అవుతోంది.. ఇప్పటికే ఈ రంగంపై జీఎస్టీ ఉండగా.. అది భారీగా పెంచేందుకు కేంద్రం సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో, ది ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా( ఐఏఎంఏఐ) ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 18 శాతం జీఎస్టీని కొనసాగించాలంటూ జీఎస్టీ కౌన్సిల్‌ను కోరింది. ఇదే సమయంలో.. జీఎస్టీ రేట్లను ఇంకా పెంచితే ఆ ప్రభావం గేమింగ్‌ ఇండస్ట్రీపై పడుతుందని.. అది దేశ ఎకానమీపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

Read Also: Beer Sales: పెరిగిన ఉష్ణోగ్రతలు.. బీర్లకు ఫుల్‌ డిమాండ్‌..!

కరోనా తర్వాత అంతా విద్య కూడా ఆన్‌లైన్‌కే పరిమితం కావడంతో.. మొదట్లో ఆన్‌లైన్‌ తరగతులు బాగానే విన్న విద్యార్థులు.. ఆ తర్వాత క్రమంగా గేమ్స్‌పై పడిపోతున్నారనే ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది.. ఆన్‌లైన్‌, ఆఫ్‌ లైన్‌ గేమ్‌లను తెగ ఆడేస్తున్నారు విద్యార్థులు.. అయితే, జీఎస్టీ ఏ గేమ్స్‌పై వేస్తారు… ఫ్రీగా ఆడే గేమ్స్‌తో పాటు డబ్బులు చెల్లించే ఆడి ఆన్‌లైన్‌ గేమ్స్‌పై జీఎస్టీ విధిస్తారా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.. జీఎస్టీ ఏ గేమ్స్‌కు వర్తిస్తుందనే అంశంపై జీఎస్టీ కౌన్సిల్‌ నుంచి స్పష్టత లేదని చెబుతోంది ఐఏఎంఏఐ.. కాగా, ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమపై 18 శాతంగా ఉన్న జీఎస్టీని 28 శాతానికి పెంచేందుకు మంత్రుల బృందం ఓ నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది.. మొత్తంగా ఆన్‌లైన్‌ గేమింగ్‌ ఇండస్ట్రీపై జీఎస్టీ పెంపు వ్యవహారం ఆ పరిశ్రమను కలవరపెడుతోంది.. ఇది ఎటువైపు దారితీస్తుంది. అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version