NTV Telugu Site icon

Android 13: ఆండ్రాయిడ్ 13 గురించి ఈ విష‌యాలు త‌ప్ప‌క తెలుసుకోవాలి…

గూగుల్ సంస్థ గ‌తేడాది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ ను రూపోందించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఓఎస్ 12 ఇప్ప‌టికే పూర్తి స్థాయిలో యూజ‌ర్ల‌కు అంద‌లేదు. ఆండ్రాయిడ్ 12 వెర్ష‌న్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాక‌ముందే మ‌రో కొత్త వెర్ష‌న్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గూగుల్ ప్ర‌య‌త్నం చేస్తున్న‌ది. ఇప్ప‌టికే గూగుల్ ఆండ్రాయిడ్ 13 వెర్ష‌న్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్ర‌స్తుతం డెవ‌ల‌ప‌ర్ వెర్ష‌న్‌ను రిలీజ్ చేసింది.

Read: Live: ఏపీ రహదారులకు మహర్దశ…

ఆండ్రాయిడ్ 13 వెర్ష‌న్‌లో గూగుల్ నోటిఫికేష‌న్‌లోని సెంట్ర‌ల్ బ‌ట‌న్‌లో కొన్ని మార్పులు చేసింది. ఇందులో కొత్తగా వ‌న్‌హ్యాండ్ మోడ్‌ను తీసుకొచ్చింది. అంతేకాదు, క్యూఆర్ కోడ్‌ను ఈజీగా స్కానింగ్ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ టోగుల్‌ను తీసుకొచ్చింది. పాత ఓఎస్ కు భిన్నంగా ఇందులో మీడియా ప్లేయ‌ర్ల‌లో ష‌పుల్‌, రిపీట్ ఆప్ష‌న్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాదు, ఇందులో పిక్చ‌ర్ ఇన్ పిక్చ‌ర్ మోడ్‌ను కూడా తీసుకొచ్చిన‌ట్టు స‌మాచారం. చాలా కాలంగా యూజ‌ర్లు ఈ ఆప్ష‌న్ కోసం ఎదురు చూస్తున్నారు. అంతేకాదు, మెనూలో యాప్స్ ను సులువుగా వెతికేందుకు కీబోర్డ్ ఆప్ష‌న్‌ను అందిస్తున్నారు. వాల్ పేప‌ర్‌ను హోమ్ స్క్రీన్ పైనుంచే మార్చుకునే సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ది వీటితో పాటు మ‌రిన్ని కొత్త ఆప్ష‌న్ల‌ను తెర‌మీద‌కు తీసుకొచ్చింది.