GST Rate Cut Impact: జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. ఆటో కంపెనీల తర్వాత.. తాజాగా FMCG(ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్) కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను తగ్గించనున్నాయి. దేశంలోని అతిపెద్ద ఫాస్ట్-మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీలలో ఒకటైన హిందూస్తాన్ యూనిలీవర్ (HUL), దాని ప్రసిద్ధ ఉత్పత్తులైన డబ్ షాంపూ, లైఫ్‌బాయ్ సోప్, హార్లిక్స్, కాఫీ, ఇతర వస్తువుల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 22 నుంచి వస్తువులు, సేవల పన్ను (GST) సంస్కరణ అమలులోకి వచ్చే నాటికి ఈ ఉత్పత్తుల ధర తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులు పొందుతారు. ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ప్రకటనలో అనేక ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లను తగ్గించిన తర్వాత కొత్త రేట్లను లిస్ట్ కంపెనీ విడుదల చేసింది. కొత్త ధరతో ఉత్పత్తుల స్టాక్‌లు త్వరలో మార్కెట్‌కు చేరుకుంటాయని కంపెనీ తెలిపింది. పూర్తి లిస్ట్‌ను ఇప్పుడు చూద్దాం..
ఏయే వస్తువులపై రేట్లు ఎంత తగ్గాయి?
ప్రోడక్ట్ పేరు – పాత ధర – కొత్త ధర
340ml డవ్ షాంపూ బాటిల్ : రూ.490 – రూ.435
200 గ్రాముల జార్ హార్లిక్స్ ధర : రూ.130 – రూ.110
200 గ్రాముల కిసాన్ జామ్ : రూ. 90 – రూ.80
75 గ్రాముల లైఫ్‌బాయ్ సబ్బు : రూ.68- రూ.60
క్లినిక్ ప్లస్ 355ml షాంపూ : రూ.393 – రూ.340
సన్‌సిల్క్ బ్లాక్ సైన్ షాంపూ 350 ml : రూ.430 – రూ.370
డవ్ సీరం 75 గ్రాములు : రూ.45 – రూ.40
లైఫ్‌బాయ్ సబ్బు (75గ్రా X 4) : రూ.60 – రూ.68
లక్స్ సోప్ (75గ్రా X 4) : రూ.96 – రూ.85
క్లోజప్ టూత్‌పేస్ట్ (150గ్రా) : రూ.129 – రూ.145
కిసాన్ కెచప్ (850గ్రా) : రూ.100 – రూ.93
హార్లిక్స్ ఉమెన్ 400 గ్రాముల ధర : రూ.320- రూ.284
బ్రూ కాఫీ 75 గ్రాముల ధర : రూ.300 – రూ.270
నార్ టమాటో సూప్ 67గ్రా ధర: రూ.65 – రూ.55
హెల్మాన్ రియల్ మయోనైస్ 250 గ్రాముల ధర: రూ.99 – రూ.90
బూస్ట్ 200గ్రాముల ధర : రూ.124 – రూ.110
