NTV Telugu Site icon

GST Collections: జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్లు.. ఎంత వచ్చిందంటే..!

Gst

Gst

జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్లు భారీగా పెరిగాయి. జనవరిలో మొత్తంగా జీఎస్టీ ఆదాయం రూ.1,95,506 కోట్లు వసూలు కాగా.. గతేడాదితో పోలిస్తే 12.3 శాతం పెరగడం విశేషం. ఇందులో దేశీయ లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ 10.4 శాతం పెరిగి రూ.1.47 లక్షల కోట్లకు చేరగా.. దిగుమతి వస్తువులపై విధించిన పన్నుల నుంచి వచ్చిన రెవెన్యూ 19.8శాతం పెరిగి రూ.48,382 కోట్లుగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి.

ఇది కూడా చదవండి: Purandeswari: కేంద్ర బడ్జెట్.. కోట్లాది మంది ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్

తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, యూపీ వంటి పెద్ద రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు 10-20 శాతం గణనీయంగా పెరగ్గా.. అదే తరహా రాష్ట్రాలైన కర్ణాటక, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో కేవలం 5-9శాతం మాత్రమే వసూలైనట్లుగా నిపుణులు పేర్కొన్నారు.

సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2024లో జీఎస్టీ వసూళ్లు వరుసగా రూ. 1.73 లక్షల కోట్లు, రూ. 1.87 లక్షల కోట్లు, రూ. 1.82 లక్షల కోట్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 9.1% పెరుగుదల కనిపించింది. అయినప్పటికీ ఈ సేకరణలు 2024 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన మొత్తం కంటే 18.98% తక్కువగా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: W/O Anirvesh: సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం W/O అనిర్వేష్.. పోస్టర్‌ విడుదల..