Groww Q4 Results: స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన గ్రో.. లాభాల పంట పండించిన ఈ షేరు గురించి తెలుసా?
- 'గ్రో'.. మార్చి క్వార్టర్లో రూ. 686 కోట్ల ప్రాఫిట్
- 122 శాతం పెరిగిన లాభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Groww Q4 Results: ప్రముఖ ఆన్‌లైన్ స్టాక్ బ్రోకింగ్ ప్లాట్‌ఫామ్ ‘గ్రో’ మాతృ సంస్థ ‘బిలియన్ బ్రెయిన్స్ గ్యారేజ్ వెంచర్స్’ అంచనాలను మించి రాణించింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ ఆర్థిక ఫలితాలు అద్భుతమైన వృద్ధిని కనబరిచాయి. ఈ కంపెనీ నికర లాభం విషయానికి వస్తే.. గతేడాదితో పోలిస్తే ఏకంగా 122 శాతం వృద్ధితో రూ.686 కోట్లుగా నమోదైంది. ఆదాయం విషయానికి వస్తే కంపెనీ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 87 శాతం పెరిగి రూ.1,505 కోట్లకు చేరింది. ఎబిటా 142 శాతం జంప్‌తో రూ.939 కోట్లుగా రికార్డయ్యింది. ఖర్చులను నియంత్రించుకుంటూనే ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవడంలో ‘ఆపరేటింగ్ లీవరేజ్’ ప్లాన్ కంపెనీకి బాగా కలిసివచ్చిందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Tragedy : మంచిర్యాలలో ఘోరం.. రూ.100 ఇవ్వలేదని ప్రాణం తీసిన దుండగుడు.!
Also Read
- FSSAI Action Against Dabur: 145 ఏళ్ల డాబర్‌కు షాక్.. ఎఫ్ఎస్ఎస్ఏఐ కఠిన చర్యలు..! కుప్పకూలిన షేర్లు..
- FSSAI: మందు బాబులకు బిగ్ అలర్ట్.. ఈ విస్కీ, రమ్ బాటిళ్లు ఇక దొరకవా?
- ఒకే రీఛార్జ్‌లో Wi-Fi, TV, OTT.. నెలకు రూ.400 నుంచే..! Jio నుంచి కొత్త 3-in-1 హోమ్ ప్లాన్స్ అదుర్స్..
- కేంద్రం కీలక నిర్ణయం.. డీజిల్, పెట్రోల్, ATF ఎగుమతులపై భారీగా Windfall Tax పెంపు..!
F&O ద్వారా భారీ ఆదాయం..
మార్కెట్లో నెలకొన్న ఒడిదుడుకుల వల్ల పెట్టుబడిదారులు ఫ్యూచర్స్ & ఆప్షన్స్ వైపు మొగ్గు చూపారు. దీంతో గ్రో మొత్తం ఆదాయంలో ఈ విభాగం వాటా 54.6 శాతానికి పెరిగింది. అలాగే మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (MTF) వంటి కొత్త ఆప్షన్లు కూడా కంపెనీకి అదనపు బలాన్ని ఇచ్చాయన్నారు. గ్రో ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రస్తుతం 2.16 కోట్ల మంది లావాదేవీలు చేస్తున్నారు. ఇందులో 1.67 కోట్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారు. మ్యూచువల్ ఫండ్ విభాగంలో కూడా కంపెనీ సత్తా చాటింది. ఈ కంపెనీ ఆధ్వర్యంలో కొత్త SIP రిజిస్ట్రేషన్లు 61.5 శాతం పెరిగాయి. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.25,000 కోట్ల నికర పెట్టుబడులు మార్కెట్లోకి వచ్చాయి. కస్టమర్ల మొత్తం ఆస్తుల విలువ 36 శాతం పెరిగి రూ.3 లక్షల కోట్లకు చేరుకుంది.
కేవలం బ్రోకింగ్ మాత్రమే కాకుండా, గ్రో తన క్రెడిట్ బిజినెస్‌ను కూడా విస్తరిస్తోంది. మొత్తం లాభాల్లో ప్రస్తుతం దీని వాటా 4.1 శాతంగా ఉంది. అయితే సబ్సిడరీ సంస్థలైన ‘ఫిస్‌డమ్’, అసెట్ మేనేజ్‌మెంట్ వ్యాపారాలు ఇంకా పెట్టుబడుల దశలోనే ఉండటంతో ప్రస్తుతం కొంత నష్టాలను ఎదుర్కొంటున్నాయి. భవిష్యత్తులో ఇవి కూడా లాభాల బాట పడతాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
READ ALSO: Lenskart controversy: ఒక్కరోజే లెన్స్‌కార్ట్‌కు రూ.4,500 కోట్లు లాస్.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!