Site icon NTV Telugu

Multibagger Stock: అద్భుతం సృష్టించిన స్టాక్.. లక్ష పెట్టుబడి పెడితే రూ. 34 లక్షలకు పైగా..!

Stock

Stock

Multibagger Stock: ఏ స్టాక్ ఎప్పుడు అద్భుతాలు చేస్తుందో.. స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులను ధనవంతులను చేస్తుందో ఊహించడం సాధ్యం కాదు. మార్కెట్లో అలాంటి అద్భుతాలు చేసిన స్టాక్‌లు చాలా ఉన్నాయి. అలాంటి స్టాక్‌లలో గ్రావిటా ఇండియా లిమిటెడ్ స్టాక్ ఒకటి. ఇది స్వల్పకాలంలో పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్‌గా ఉద్భవించింది. ఐదేళ్ల క్రితం ఇందులో రూ. 1,00,000 ఇన్‌వెస్ట్ చేసిన వారి షేర్ల విలువ ప్రస్తుతం రూ. 34 లక్షలకు పైగా పెరిగింది.

READ MORE: Visakhapatnam : విశాఖ ఈస్ట్ ఇండియా పెట్రోలియం కంపెనీలో ప్రమాదం

గ్రావిటా ఇండియా ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను పరిశీలిస్తే.. 3,346% అద్భుతమైన రాబడిని ఇచ్చింది. ఒకప్పుడు ఇది ఒక రీసైక్లింగ్ సంస్థ. ఇది ప్రధానంగా సీసం, అల్యూమినియం, ప్లాస్టిక్ రీసైక్లింగ్‌లో ప్రత్యేకత కలిగి ఉండేది. 1992లో స్థాపించిన ఈ కంపెనీ వ్యాపారం భారతదేశంతో పాటు ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇతర ఖండాలలో విస్తరించి ఉంది. ఆయా దేశాల్లో ఈ కంపెనీ యూనిట్లు ఉన్నాయి. కాగా.. 11 సెప్టెంబర్ 2020న, ఈ గ్రావిటా ఇండియా షేరు ధర కేవలం రూ. 49.30గా ఉండేది. అది ఇప్పుడు రూ. 1699కి పెరిగింది. దీని ప్రకారం.. కేవలం ఐదు సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు 3,346 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. ఒక పెట్టుబడిదారుడు ఐదు సంవత్సరాల క్రితం అంటే 2020 సెప్టెంబర్ 11న ఈ స్టాక్‌లో రూ. 49 చొప్పున లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే.. ఇప్పుడు దాని విలువ రూ. 34,46,000కి పెరిగి ఉండేది.

READ MORE: West Bengal : వెస్ట్ బెంగాల్‌లో షాకింగ్ ఘటన – బాలికపై గ్యాంగ్ రేప్

తాజాగా గ్రావిటా ఇండియా స్టాక్ రోజంతా లాభాలతో ట్రేడ్ అయి చివరకు లాభాలతో ముగిసింది. ఇది రూ.1657.80 వద్ద ప్రారంభమైంది. ఆపై ట్రేడింగ్ ముగిసే సమయానికి ఊపందుకుంది. 2.49% లాభంతో రూ.1699 వద్ద ముగిసింది. దీని ప్రభావం కంపెనీ మార్కెట్ విలువపై కూడా కనిపించింది. కంపెనీ విలువ రూ.12330 కోట్లకు పెరిగింది. ఈ స్టాక్ యొక్క 52 వారాల గరిష్ట స్థాయి రూ.2700 కాగా, 52 వారాల కనిష్ట స్థాయి రూ.1379.65.

గమనిక: స్టాక్ మార్కెట్లో ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు, దయచేసి మీ మార్కెట్ నిపుణుల సలహా తీసుకోండి.

Exit mobile version