Site icon NTV Telugu

Government Scheme : బాలికల చదువు కోసం ప్రభుత్వం ఎంత సాయం చేస్తుందో తెలుసా?

Govt Schemes

Govt Schemes

ఆడ పిల్లల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తుంది.. అందులో భాగంగా వారి చదువుకోసం ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తుంది.. ఈ క్రమంలో ప్రారంభించిన ‘బేటీ బచావో-బేటీ పఢావో’ ప్రచారం దేశంలో నడుస్తోంది. బాలికల భద్రత, విద్యను నిర్ధారించడం ఈ పథకం లక్ష్యం..ఆడపిల్లలకు పుట్టినప్పటి నుంచి వారి చదువు వరకు ఆర్థిక సాయం అందించే పథకం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కంటే ముందు దేశంలో మరొకటి ఉంది. 1997లో ప్రభుత్వం ‘బాలికా సమృద్ధి యోజన అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది..

మొదట్లో ఒక కుమార్తె పుట్టినప్పుడు, తల్లికి ఆర్థిక సహాయంగా రూ. 500 అందుతుంది.  ఆ ఆడపిల్ల పదో తరగతి వరకు బాలిక విద్య, ప్రతి దశలో ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది.. ఇప్పుడు అమౌంట్ ను పెంచేసింది.. ఈ పథకం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..ప్రతి కుటుంబంలో గరిష్టంగా ఇద్దరు కుమార్తెల కోసం ఈ పథకాన్ని పొందవచ్చు. బాలికా సమృద్ధి యోజనకు దరఖాస్తు చేయడానికి అవసరమైన పత్రాలలో ఆడపిల్ల జనన ధ్రువీకరణ పత్రం, తల్లిదండ్రుల నివాసం, తల్లిదండ్రులు లేదా బంధువుల గుర్తింపు రుజువు అవసరం అవుతాయి. ఆమోదయోగ్యమైన గుర్తింపు రుజువుల్లో రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ కు కూడా అవసరం అవుతుంది.. బిడ్డ తల్లి పేరు మీద అకౌంట్ తీసుకోవడం మంచిది..

ఇకపోతే బాలికా సమృద్ధి యోజన కోసం దరఖాస్తు చేయడానికి మీరు దరఖాస్తును ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో సమర్పించవచ్చు. ఆఫ్‌లైన్ దరఖాస్తులను అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సేవా కేంద్రాల నుండి పొందవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు ఎలక్ట్రానిక్ రూపంలో ఫారమ్‌ను పూరించి సమర్పించాలి. గ్రామీణ, పట్టణ లబ్ధిదారుల కోసం వేర్వేరు ఫారమ్‌లు ఉంటాయని గుర్తించాలి. ముఖ్యంగా అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించాలని గమనించడం ముఖ్యం.. ఈ పథకం కింద బాలికల చదువు కోసం అమౌంట్ అందిస్తుంది.. అయితే ఒకటో తరగతి నుంచి మూడో తరగతి విద్యార్థులకు సంవత్సరానికి 300 ఇస్తారు. దీన్ని క్రమక్రమంగా పెంచుతూ తొమ్మిది, పదో తరగతి వచ్చేసరికి రూ.1000 సాయం చేస్తారు.. ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బాలికల సంరక్షనను చూస్తారు..

Exit mobile version