Site icon NTV Telugu

Gold-Silver Rates: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు

Gold

Gold

ప్రపంచ దేశాలను యుద్ధ సంక్షోభం వెంటాడుతున్న వేళ అన్ని ధరలు పెరుగుతున్న సమయంలో బంగారం, వెండి ధరలు మాత్రం దిగొస్తున్నాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సమయాల్లో కొనుగోలుదారులకు ఇది శుభవార్తగా చెప్పొచ్చు. ఈరోజు తులం గోల్డ్ ధరపై రూ.980 తగ్గగా.. కిలో వెండిపై రూ.100 తగ్గింది.

తులం గోల్డ్‌పై రూ.980 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,61,240 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.900 తగ్గడంతో రూ.1,47,800 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.740 తగ్గడంతో రూ.1,20,930 దగ్గర ట్రేడ్ అవుతోంది.

ఈరోజు సిల్వర్ ధర ఊరట కలిగించింది. ఈరోజు కిలో వెండి ధరపై ఏకంగా రూ.100 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.2,79, 900 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,90,000 దగ్గర ట్రేడ్ అవుతోంది.

Exit mobile version