Gold-Silver Rates: సీజ్ఫైర్ వేళ గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
- సీజ్ఫైర్ వేళ గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్
- భారీగా పెరిగిన వెండి, బంగారం ధరలు
- యుద్ధం కాలంలో తగ్గిన పసిడి ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా కాల్పుల విరమణ ఒప్పందం వేళ మగువలకు భారీ షాక్ తగిలింది. మధ్యప్రాచ్యం యుద్ధం జరిగినంత కాలం పసిడి ధరలు దిగొచ్చాయి. తాజాగా ఇరాన్‌తో రెండు వారాల పాటు కాల్పుల విరమణ జరిగినట్లుగా ట్రంప్ ప్రకటించారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు భారీగా పుంజుకున్నాయి. కానీ బంగారం, వెండి ధరలు మాత్రం హడలెత్తిస్తున్నాయి. అసలే ప్రస్తుతం పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్యులు లబోదిబో అంటున్నారు. ఈరోజు ఏకంగా తులం గోల్డ్‌పై రూ.3,980 పెరగగా.. కిలో వెండిపై రూ.10,000 పెరిగింది.
తులం గోల్డ్‌పై రూ.3,980 పెరగడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,53,820 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.3,650 పెరగడంతో రూ.1,41,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,990 పెరగడంతో రూ.1,15,370 దగ్గర ట్రేడ్ అవుతోంది.
Also Read
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
- Gold and Silver Price Today: బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు.. రెండో రోజూ భారీ పెరుగుదల
- iPhone Langar: ఐఫోన్ కొనలేకపోతున్నారా..? ఉచితంగా పొందే అవకాశం మిస్ కావొద్దు..!
- iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
బాబోయ్.. సిల్వర్ ధర బెంబేలెత్తిస్తోంది. ఈరోజు కిలో వెండిపై రూ.10,000 పెరిగింది. దీంతో బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,60, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,65,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.2,60, 000 దగ్గర అమ్ముడవుతోంది.
తాజావార్తలు
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
-
Varanasi-Mahesh Babu: ఇంకా ఒక వారమే.. మహేష్ బాబు ‘వారణాసి’ నుంచి క్రేజీ అప్డేట్!
-
Motorola Signature 27: మోటరోలా Signature 27 లాంచ్ డేట్ కన్ఫర్మ్.. 200MP కెమెరా, Dolby Vision సపోర్ట్, ప్రీమియం డిజైన్
-
PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!