Gold & Silver Prices: బంగారం, వెండి ధరలు 2025 లో సృష్టించిన చారిత్రక రికార్డులను చూసి సామాన్యుల నుంచి పెట్టుబడిదారుల వరకు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ బూమ్ ఇప్పుడే ఆగిపోతుందని మీరు అనుకుంటే పొరపడినట్లే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ ‘బుల్ రన్’ 2026 లో కూడా కొనసాగుతుందని, బంగారం, వెండి ధరలు ఈ ఏడాదిలో కొత్త శిఖరాలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. కొత్త సంవత్సరంలో వీటి ధరలు ఎలా ఉండబోతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Harish Rao : థియేటర్లలో కాదు.. సచివాలయంలోనే ‘సస్పెన్స్ థ్రిల్లర్’ నడుస్తోంది
ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA), MCX నుంచి వచ్చిన తాజా డేటాను గమనిస్తే.. ఇప్పటికే మార్కెట్ వేడెక్కుతున్నట్లు కనిపిస్తుంది. గత వారం బంగారం 10 గ్రాములకు రూ.138,875కి చేరుకున్నాయి. మీరు షాపింగ్‌కు వెళితే అక్కడ 24 క్యారెట్ల బంగారం స్పాట్ ధర 10 గ్రాములకు రూ.137,122కి చేరుకోవడం చూసి ఉంటారు. వెండి మెరుపు బంగారం కంటే బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. MCXలో మార్చి గడువు ముగిసిన వెండి కిలోగ్రాముకు రూ.252,002 కు చేరుకుంది. వెండి దాని మునుపటి శ్రేణి నుంచి బయటపడి బలమైన బుల్లిష్ దశలోకి ప్రవేశించింది. అంటే వెండి ధరలు మరింత పెరగడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం. ఈ విపరీతమైన ధరల పెరుగుదల కేవలం వివాహ షాపింగ్ కారణంగానే లేదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితుల కారణంగా ఇవి రికార్డు వేగంతో దూసుకుపోతున్నాయి.
వెండి రూ.3 లక్షలకు చేరుతుందా..
గత సంవత్సరం వెండిలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులకు మంచి రాబడి వచ్చింది. 2025లో పెట్టుబడిదారులకు బంగారం దాదాపు 66 శాతం, వెండి 171 శాతం కంటే ఎక్కువ రాబడి ఇచ్చింది. ఇప్పుడు ఈ ధోరణి ఎక్కడ ఆగుతుందనేది అతిపెద్ద ప్రశ్న. 2026 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు $5,000కి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిని భారత రూపాయలలో గమనిస్తే బంగారం ధర 10 గ్రాములకు రూ.1.70 లక్షల నుంచి రూ.2 లక్షల మధ్య ఉండవచ్చు. ఇదే టైంలో వెండి అంచనాలను పరిశీలిస్తే మరింత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. వెండి ఔన్సుకు $100కి చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనిని భారత మార్కెట్లో పరిశీలిస్తే వెండి ధర కిలోగ్రాముకు రూ.2.8 లక్షల నుంచి రూ.3.3 లక్షల మధ్య ఉండవచ్చని సమాచారం. మొత్తానికి ఈ కొత్త ఏడాదిలో కూడా బంగారం, వెండి ఆకాశమే హద్దుగా ధరల విషయంలో దూసుకుపోయే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
READ ALSO: Vijay Deverakonda: దేవరకొండ మార్కు కామెంట్స్
