Site icon NTV Telugu

Gold & Silver Prices: కొండెక్కిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన కారణాలు ఇవే..

Gold & Silver Prices

Gold & Silver Prices

Gold & Silver Prices: బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి. గురువారం, బంగారం వెండి ధరలు ఊహించని రీతిలో పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో వెండి తొలిసారిగా కిలోకు 4 లక్షల రూపాయల మ్రేక్‌ను దాటింది. బంగారం సైతం 10 గ్రాములకు 1.8 లక్షల రూపాయలకు చేరింది. దీనికి ప్రధాన కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న భయం, రాజకీయ ఒత్తిడుల కారణంగా ధరలు కొండెక్కుతున్నాయి. MCXలో ఫిబ్రవరి 5, 2026కి ముగిసే బంగారం కాంట్రాక్టు ధర 6% పెరిగింది. 10 గ్రాములకు గానూ 1,75,869 రూపాయలకు చేరింది. మార్చ్ 5, 2026కి ముగిసే వెండి ధర 5% ఎగసి 4,00,780 రూపాయలకు వచ్చింది. ఇంతకు బంగారం, వెండి ఇంతలా పెరగడానికి కారణాల గురించి తెలుసుకుందాం..

READ MORE: Tirupati Laddu Controversy: చంద్రబాబు అవకాశవాది, అధికారం కోసం దేనికైనా తెగిస్తారు..

ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనట్లు నిర్ణయించడమని నిపుణులు చెబుతున్నారు. రాజకీయ పరిణామాలు కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై హెచ్చరికలు చేశారు. న్యూక్లియర్ చర్చలు నిలిచిపోయాయని, “సమయం ముగుస్తోంది” అని చెప్పారు. అలాగే గల్ఫ్‌ ప్రాంతంలో భారీ సైనిక నియామకాలు చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు.. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి రికార్డ్ స్థాయిలకు చేరాయి. స్పాట్ బంగారం ఒక్కరోజులో 3% పెరిగి $5,591.61 ఒకౌన్స్‌కి చేరింది. వెండి ఒక్కసారిగా $119.34 ఒకౌన్స్‌కి చేరి, తర్వాత $118.061 వద్ద స్థిరపడింది. మార్కెట్ విశ్లేషకుల వివరాల ప్రకారం.. వెండి బంగారం కంటే తక్కువకు లభిస్తుంది. దీంతో కొందరు పెట్టుబడిదారులు ట్రెండ్‌ను అనుసరించి వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ అంశంపై తాజాగా ప్రిటివి ఫిన్మార్ట్ భాగస్వామి మనోజ్ కుమార్ జైన్ మాట్లాడారు. మరికొన్ని రోజులలో బంగారం, వెండి ధరల్లో మార్పులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. డాలర్ ఇండెక్స్, అమెరికా ఉద్యోగ గణాంకాలు, రాజకీయ ఉద్రిక్తతలతో ఇది ప్రభావితమవుతుంది. దేశీయంగా బంగారం Rs 1,61,600–1,64,000 మద్దతు వద్ద నిలవగలదని పేర్కొన్నారు. వెండి Rs 3,64,800–3,74,000 మద్దతులో ఉండవచ్చని సూచించారు.

Exit mobile version