Gold Rate Today: నిన్న తగ్గినట్టే తగ్గి.. నేడు మళ్లీ షాక్! భారీగా పెరిగిన బంగారం ధరలు

Today Gold Price

Today Gold Price

Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మళ్లీ షాక్ తగిలింది. నిన్న కాస్త తగ్గినట్లు కనిపించిన పసిడి ధరలు నేడు భారీగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.2,610 పెరగగా, 22 క్యారెట్ల బంగారంపై రూ.2,400 పెరిగింది. దీంతో పసిడి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గోల్డ్ ధరలు పెరగగా సిల్వర్ ధరలు మాత్రం స్థిరంగ కొనసాగుతున్నాయి.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం గ్రాము ధర రూ.12,589గా ఉండగా, 10 గ్రాముల ధర రూ.1,25,890కు చేరింది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాములపై రూ.2,610 పెరిగింది. ఇక 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,540గా, 10 గ్రాముల ధర రూ.1,15,400గా ఉంది. దీనిపై రూ.2,400 పెరుగుదల నమోదైంది. అలాగే 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.9,442గా ఉండగా, 10 గ్రాముల ధర రూ.94,420కు చేరింది. దీనిపై రూ.1,960 పెరిగింది.

ఢిల్లీలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

దేశ రాజధాని ఢిల్లీలోనూ పసిడి ధరలు భారీగా పెరిగాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.12,604గా ఉండగా, 10 గ్రాముల ధర రూ.1,26,040కు చేరింది. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,555గా, 10 గ్రాముల ధర రూ.1,15,550గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.9,457గా ఉండగా, 10 గ్రాముల ధర రూ.94,570కు చేరింది.

ముంబై, విజయవాడలోనూ పెరిగిన పసిడి ధరలు

ముంబై, విజయవాడ నగరాల్లోనూ హైదరాబాద్‌లో ఉన్న ధరలే కొనసాగుతున్నాయి. ఈ రెండు నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,890గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,15,400 కాగా, 18 క్యారెట్ల ధర రూ.94,420గా నమోదైంది.

వెండి ధర

నేడు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ.1.65 లక్షల వద్ద అమ్ముడవుతోంది.