Gold and Silver Rates Today in Hyderabad: కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ కాస్త బ్రేక్ పడింది. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.350.. 24 క్యారెట్లపై రూ.380 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (మే 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,650గా.. 24 క్యారెట్ల ధర రూ.1,52,350గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో బంగారం ధరలు తగ్గాయి. దాంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది.
హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,52,350గా నమోదయింది. అదే సమయంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,39,650గా ఉంది. చెన్నైలో కూడా బంగారం ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం రూ.500 తగ్గి రూ.1,40,500కు చేరగా.. 24 క్యారెట్ల బంగారం రూ.540 తగ్గి రూ.1,53,280గా ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో కూడా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం రూ.350 తగ్గి రూ.1,39,800గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.380 తగ్గి రూ.1,52,500కు చేరుకుంది. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు.
వెండి ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,65,000కు చేరింది. ఢిల్లీలో కూడా రూ.5,000 పెరిగి రూ.2,55,000గా నమోదైంది. ఈ మార్పులు మార్కెట్ డిమాండ్, అంతర్జాతీయ పరిస్థితులు, డాలర్ విలువ ఆధారంగా మారుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. బంగారం ధరల్లో వచ్చిన ఈ తగ్గుదల మార్కెట్లో కొనుగోళ్లకు ఊతమివ్వవచ్చు. వివాహాలు, పండుగల సీజన్ ముందున్న నేపథ్యంలో ఈ ధరల మార్పు వినియోగదారులకు లాభదాయకంగా మారే అవకాశం ఉంది.
