NTV Telugu Site icon

Gold Prices Today: పండుగవేళ షాకిస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ లో ఎంతంటే?

Gld

Gld

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే నేడు ధరలకు రెక్కలు వచ్చాయి.. మన దేశంలో 10 గ్రాముల బంగారం 22 కేరెట్లు ధర 400 రూపాయలు పెరిగి రూ. 60,100 వద్దకు చేరింది. పసిడి 24 కేరెట్లు ధర 430 రూపాయలు పెరిగి రూ 65,560 గా ఉంది.. అలాగే కిలో వెండి పై రూ. 500 మేర పెరిగి..రూ. 78,500 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

చెన్నైలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ రూ. 60,900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 66,440 కి చేరింది. కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.60,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 65,560 కి చేరింది. దిల్లీలో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 60,250 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,710 గా నమోదైంది.. బెంగళూరులో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 60,100 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.65,560 గా ఉంది.. హైదరాబాద్ లో 10 గ్రాముల బంగారం 22 కేరెట్లు ధర 400 రూపాయలు పెరిగి రూ. 60,100 వద్దకు చేరింది. పసిడి 24 కేరెట్లు ధర 430 రూపాయలు పెరిగి రూ 65,560 గా ఉంది..

ఇక వెండి విషయానికొస్తే.. బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి.. కిలో పై రూ. 500 పెరిగింది.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.74,900గా ఉంది. ముంబైలో రూ.74,900 ఉండగా.. చెన్నైలో రూ.78,400గా కొనసాగుతోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.78,400లుగా కొనసాగుతోంది. అత్యల్పంగా బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,600గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..