Gold Prices: భారతదేశంలో ఆగస్టు 8న బంగారం ధరలు సరికొత్త గరిష్ఠాలకు చేరుకొని చరిత్ర సృష్టించాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్ ఫ్యూచర్స్ బంగారం 10 గ్రాములకు ₹ 1,02,250కి చేరుకుంది. ఇదే ఇప్పటివరకు అత్యధిక స్థాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం మెరుస్తోంది. COMEXలో డిసెంబర్ ఫ్యూచర్స్ ఔన్సుకు $3,534కి చేరుకుంది. ఇది ఏప్రిల్‌లో నమోదైన $3,544 రికార్డు ధరకు చాలా దగ్గరగా ఉంది. అసలు బంగారం ధరలు పెరగడానికి గల కారణాలు, ధరలు ఎంత వరకు పెరగవచ్చు, ఈ ధరల పెరుగుదలకు అమెరికా సుంకాల నిర్ణయం ఎంత వరకు కారణం అవుతుందో తెలుసుకుందాం.
READ MORE: Rajat Patidar: హలో! నేను విరాట్ కోహ్లీ.. యువకుడికి స్టార్ క్రికెటర్ల నుంచి కాల్స్..
ధరల పెరుగుదలకు కారణం ఏమిటి..
భారతదేశం – అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, అక్టోబర్‌లో US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల తగ్గించడం.. బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండియా-యూఎస్‌ల మధ్య చర్చల్లో కచ్చితమైన పురోగతి కనిపించే వరకు బంగారం ధరల్లో మార్పులు రావని LKP సెక్యూరిటీస్‌లో కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్ హెడ్ జతిన్ త్రివేది అభిప్రాయపడ్డారు. ధరలు ₹ 99,500 కంటే తక్కువగా ఉంటేనే పెద్ద అమ్మకాలకు అవకాశం ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో బంగారం ₹ 99,500 నుంచి ₹ 1,03,000 పరిధిలో హెచ్చుతగ్గులకు లోనవుతుందని అంచనా వేశారు. పసిడి ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయం. 1 కిలో, 100 ఔన్సుల బంగారు కడ్డీల దిగుమతిపై అమెరికా సుంకం విధించింది. ఇది బంగారం ధరలు పెరగడానికి కారణం అయ్యాయి. ఈ నిర్ణయం ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు శుద్ధి కేంద్రమైన స్విట్జర్లాండ్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
ట్రంప్ సర్కార్ స్విట్జర్లాండ్ నుంచి వచ్చే బంగారంపై 39% సుంకం విధించింది. ఈ నిర్ణయం ధరలను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తోంది. చైనా నిరంతర బంగారం కొనుగోళ్లు కూడా ధరల పెరుగుదలకు కారణం. జూలైలో చైనా వరుసగా తొమ్మిదవ నెల కూడా బంగారాన్ని కొనుగోలు చేసింది. దీనితో పాటు, సెప్టెంబర్‌లో US వడ్డీ రేట్లు 0.25% తగ్గవచ్చని మార్కెట్ అంచనా రావడం బంగారం ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయి.
పసిడి పరుగులు ఎంత వరకు..
బంగారం మార్కెట్ ప్రతిరోజూ కొత్త వార్తలతో ప్రభావితమవుతోందని మెటల్స్ ఫోకస్ ప్రిన్సిపల్ కన్సల్టెంట్ (దక్షిణాసియా) చిరాగ్ షేత్ అన్నారు. ట్రంప్ సుంకాల కారణంగా, అమెరికా మార్కెట్లో బంగారం లండన్ బంగారంతో పోలిస్తే $100 ప్రీమియంతో అమ్ముడవుతోందని తెలిపారు. అమెరికా ప్రతి సంవత్సరం 220-250 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. అందులో 60-70% స్విట్జర్లాండ్ నుంచి వస్తుంది. గతంలో ఈ బంగారం లండన్ నుంచి స్విట్జర్లాండ్‌కు వెళ్లి అక్కడ బార్‌లుగా మార్చబడి ఆపై అమెరికాకు పంపబడేది. కానీ ఇప్పుడు సుంకాల కారణంగా, LME బంగారాన్ని నేరుగా అమెరికాకు పంపే అవకాశం ఉంది. LBMAకి USలో రెండు శుద్ధి కర్మాగారాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగారం ధరలు ఈ సంవత్సరం చివరి నాటికి ఔన్సుకు $3,600 నుంచి $3,800 వరకు చేరుకోవచ్చని షెత్ అంచనా వేస్తున్నారు.
READ MORE: Modi-Trump: అమెరికాపై ప్రతీకార సుంకాలకు భారత్ రెడీ.. దెబ్బకు దెబ్బ కొట్టే ప్రణాళిక!
