Site icon NTV Telugu

Gold Price Today: పసిడి ప్రియులకు ఊరట.. హైదరాబాద్‌లో నేటి గోల్డ్ రేట్స్ ఇలా!

Today Gold Price

Today Gold Price

దీపావళి అనంతరం బంగారం, వెండి ధరలకు రెక్కొలొచ్చాయి. వరుసగా పెరుగుతూ లక్షా 35 వేలకు చేరువైంది. ఆపై వరుసగా గోల్డ్ రేట్స్ వరసగా తగ్గాయి. ఇటీవలి రోజుల్లో హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి. నిన్న భారీగా పెరిగిన పుత్తడి ధరలు.. ఈరోజు కాస్త ఊరటనిచ్చాయి. బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.80 తగ్గి.. రూ.12,785 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 1 గ్రాము ధర రూ.70 తగ్గి.. 11,720గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,27,850గా.. 22 క్యారెట్ల ధర రూ.1,17,200గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 24 క్యారెట్లపై రూ.800.. 22 క్యారెట్లపై రూ.700 తగ్గింది.

Also Read: Shardul Thakur: తొలి ఆటగాడిగా శార్దూల్ ఠాకూర్ చరిత్ర.. ఐపీఎల్‌లోనే ఎవరికీ సాధ్యం కాలేదబ్బా!

హైదరాబాద్ మార్కెట్‌లో స్వచ్ఛమైన 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల ధర రూ.1,27,850 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.1,17,200గా పలుకుతోంది. విశాఖ, విజయవాడలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం వరుసగా ఐదవ రోజు పెరిగాయి. కిలో వెండిపై నిన్న ఏకంగా 11 వేలు పెరగగా.. నేడు స్వల్పంగా రూ.100 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో ఈరోజు కిలో వెండి ధర రూ.1,73,100గా ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్‌, విశాఖ, విజయవాడలో రూ.1,83,000గా కొనసాగుతోంది.

Exit mobile version