NTV Telugu Site icon

Gold Price Today : మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం.. తులం ఎంతంటే?

Goldd

Goldd

పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మొన్నటివరకు కాస్త పెరిగిన బంగారం ధరలు, నేడు మార్కెట్ లో బాగా తగ్గినట్లు తెలుస్తున్నాయి.. ఆదివారం మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200లు తగ్గి రూ.58,100లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.220లు తగ్గి రూ.63,380ల వద్ద కొనసాగుతోంది.. వెండి విషయానికొస్తే.. వెండి కిలో రూ. 100ల మేర తగ్గి.. రూ.76,500లుగా కొనసాగుతోంది. ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం..

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,250లు ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.63,380 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,100లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,380లు, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,700లు, 24 క్యారెట్ల ధర రూ.64,040లు ఉంది. అలాగే, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,100లు ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.63,380లు ఉంది. మిగిలిన అన్ని నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి..

ఇక వెండి ధర విషయానికొస్తే.. వెండి కిలో రూ. 100ల మేర తగ్గి.. రూ.76,500లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.77,000లు, విశాఖపట్నంలో రూ.77,000లు, చెన్నైలో రూ.77,000ల వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో రూ.73,000 వద్ద కొనసాగుతుంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..