Gold Rate Today: నిన్న మొన్నటి వరకు భగ్గుమన్న బంగారం, వెండి ధరలు నేడు చల్లబడ్డయ్. వామ్మో ఇవేం ధరలు రా బాబు అని నిట్టూర్చిన వారికి ఊరటనిచ్చేలా గోల్డ్, సిల్వర్ ధరలు నేడు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజే ఊహించని రీతిలో పసిడి ధరలు దిగొచ్చినయ్. దేశీయ మార్కెట్లో పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా రూ.3,220 తగ్గగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,950 మేర దిగివచ్చింది. వెండి ధర కూడా కిలోపై రూ.10,000 తగ్గి రూ.1.65 లక్షలకు చేరింది.
హైదరాబాద్లో నేటి బంగారం ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర గ్రాముపై రూ.322 తగ్గి రూ.12,458కు చేరింది. దీంతో 10 గ్రాముల ధర రూ.1,24,580గా నమోదైంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై రూ.295 తగ్గి రూ.11,420కు చేరింది. 10 గ్రాముల ధర రూ.1,14,200గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై రూ.241 తగ్గి రూ.9,344కు చేరుకుంది.
ఢిల్లీలోనూ తగ్గిన బంగారం ధరలు
దేశ రాజధాని ఢిల్లీలో కూడా పసిడి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.3,170 తగ్గి రూ.1,24,730కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.2,950 తగ్గి రూ.1,14,350గా నమోదైంది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2,410 తగ్గి రూ.93,590కు చేరుకుంది.
ముంబై మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై రూ.322 తగ్గి రూ.12,458కు చేరింది. దీంతో 8 గ్రాముల ధర రూ.99,664గా, 10 గ్రాముల ధర రూ.1,24,580గా నమోదైంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై రూ.295 తగ్గి రూ.11,420కు చేరుకుంది. 8 గ్రాముల ధర రూ.91,360 కాగా, 10 గ్రాముల ధర రూ.1,14,200గా ఉంది. అలాగే 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముపై రూ.241 తగ్గి రూ.9,344కు చేరింది. దీంతో 8 గ్రాముల ధర రూ.74,752గా, 10 గ్రాముల ధర రూ.93,440గా నమోదైంది.
వెండి ధరలోనూ భారీ పతనం
బంగారంతో పాటు వెండి ధర కూడా గణనీయంగా తగ్గింది. కిలో వెండిపై ఏకంగా రూ.10,000 తగ్గడంతో ధర రూ.1.65 లక్షలకు చేరింది. దీంతో వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా కొంత ఊరట లభించింది.

