NTV Telugu Site icon

Gold Price Today: గుడ్ న్యూస్..స్థిరంగా బంగారం,వెండి ధరలు.. తులం ఎంతంటే?

Gld

Gld

బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త.. దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఎందుకంటే మార్కెట్ లో పసిడి ధరలకు ఎప్పుడూ డిమాండ్ తగ్గదు.. నిన్నటి ధరలతో పోలిస్తే, నేడు మార్కెట్ లో ధరలు స్థిరంగా ఉన్నాయి.. హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62, 350 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57, 150 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా స్థిరంగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి 78, 000 గా నమోదు అయింది..

* ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,300లు కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 62,500 ఉంది..
* ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,150 గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 62,350 వద్ద కొనసాగుతోంది.

* ఇక చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 57,650లు కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,890గా నమోదు అవుతుంది.

* కోల్‌కతా విషయానికొస్తే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,150గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,350 వద్ద కొనసాగుతోంది.

* బెంగుళూరులో 22 క్యారెట్స్‌ ధర రూ. 57,150కాగా, 24 క్యారెట్స్‌ ధర రూ. 62,350గా ఉంది.

* తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,150కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 62,350 వద్ద కొనసాగుతోంది..

ఇక వెండి విషయానికొస్తే.. ఈరోజు బంగారం బాటలోనే నడుస్తుంది.. స్థిరంగా వెండి ధరలు ఉన్నాయి.. ఢిల్లీ, ముంబయి, కోలకతాల్లో కిలో వెండి ధర రూ. 76,000గా నమోదైంది. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ. 78,000లకు చేరింది. హైదరాబాద్‌లో కూడా అదే ధరలు నడుస్తున్నాయి.. రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..