NTV Telugu Site icon

Gold Price Today : మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు కూడా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే?

Gld

Gld

బంగారం కొనుగోలు చేసేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. మరోసారి బంగారం ధరలు తగ్గిపోయాయి. బంగారం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. పండగ సీజన్ లో పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతున్నాయి.. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో కూడా కిందకు దిగివచ్చాయి..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 320 తగ్గి, రూ. 61, 530 గా నమోదు కాగా.. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 తగ్గి, రూ. 56, 400 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1200 తగ్గిపోయి రూ. 77, 000 గా నమోదు అయింది… ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

* చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,860గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 62,030 వద్ద కొనసాగుతోంది.

* ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్‌ రేట్ రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,530 వద్ద కొనసాగుతోంది.

* ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. 56,550గా ఉండగా, 24 క్యారెట్స్‌ గోల్డ్ రేట్ రూ. 61,680గా ఉంది.

* కోలకతాలో 22 క్యారెట్స్‌ బంగారం ధర రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,530 వద్ద కొనసాగుతోంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,530 వద్ద ఉంది..
* ఇక తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ధరలు 10 గ్రాములు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,400గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,530 వద్ద కొనసాగుతోంది…

ఇక వెండి కూడా అదే దారిలో నడిచింది.. ఈరోజు కిలోనపై ఏకంగా రూ.1200 తగ్గింది..చెన్నైలో కిలో వెండి ధర రూ. 77,000 వద్ద కొనసాగుతోంది. ఒక ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ. 74,100గా ఉండగా బెంగళూరులో రూ. 74,000గా ఉంది.. హైదరాబాద్ లో వెండి ధర రూ.77,000 గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..