NTV Telugu Site icon

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..

Gold Rates

Gold Rates

పసిడికి మార్కెట్ లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.. ధర ఎక్కువైనా.. తగ్గినా కూడా మహిళలు కొనడం ఆపరు..ఈరోజు ధరలు భారీగా తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. అంతర్జాతీయ మార్కెట్ ధరలపై ఆధారపడి మన దేశంలో కూడా ధరల్లో మార్పులు ఉంటాయి.. నిన్నటి ధరతో పోలిస్తే నేడు ధరలు భారీగా తగ్గినట్లు తెలుస్తుంది.. నేడు బులియన్ మార్కెట్ లో ధరలను చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల (తులం) బంగారం ధర రూ.250 మేర తగ్గి రూ.55,150 మేర ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.280 మేర తగ్గి రూ.60,160గా ఉంది. కిలో వెండి ధర రూ.1000 మేర తగ్గి రూ.78000 లుగా కొనసాగుతోంది..

ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1961 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు ఇవాళ స్వల్పంగా మారింది. ప్రస్తుతం 24.63 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే టైమ్ లో ఇండియన్ రూపాయి డాలర్ తో పోలిస్తే మారక విలువ రూ. 82.003 వద్ద కొనసాగుతుంది… దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల విషయానికొస్తే.. ఢిల్లీలో: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.60,320గా ఉంది.

ముంబైలో: 22 క్యారెట్లు రూ.55,150, 24క్యారెట్లు 60,160, చెన్నైలో 22క్యారెట్లు రూ.55,550, 24క్యారెట్లు 60,600ఉంది..
బెంగళూరులో: 22క్యారెట్లు రూ.55,150, 24క్యారెట్లు 60,160 గా ఉంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22క్యారెట్లు రూ.55,150, 24క్యారెట్లు రూ.60,160గా ఉంది. అదే విధంగా వెండి ధరలు కూడా ఉన్నాయి.. బంగారం ధరలు తగ్గితే.. వెండి కూడా అదే దారిలో నడిచింది.. ఈరోజు వెండి కూడా తగ్గుముఖం పట్టింది.. ప్రస్తుతం మార్కెట్ లో వెండి ధరలు.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.78,000 లుగా ఉంది. ముంబైలో రూ.78000, చెన్నైలో రూ.80,500, బెంగళూరులో రూ.76,500, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో వెండి ధరరూ.80,500 లుగా ఉంది. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..