Gold Price Today: బంగారం ధరల మోత.. భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్

Gold Price Drop

Gold Price Drop

Gold Price Today: బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి షాక్ ఇచ్చే వార్త. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా రూ.1,030 పెరిగింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600కు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ.950 పెరిగి రూ.1,32,550కు చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధర కూడా భారీ స్థాయిలో కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.05 లక్షలుగా ఉంది. పెరుగుతున్న పసిడి, వెండి ధరలతో కొనుగోలుదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధరలు

హైదరాబాద్ నగరంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.14,460గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.13,255గా నమోదైంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.10,845గా ఉంది.

బంగారం పరిమాణం -24 క్యారెట్లు -22 క్యారెట్లు
1 గ్రాము -రూ.14,460 (+రూ.103)- -రూ.13,255 (+రూ.95)
8 గ్రాములు-రూ.1,15,680 (+రూ.824) -రూ.1,06,040 (+రూ.760)
10 గ్రాములు-రూ.1,44,600 (+రూ.1,030) -రూ.1,32,550 (+రూ.950)

ఢిల్లీలోనూ పెరిగిన పసిడి ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,44,750గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,700కు చేరుకుంది. 18 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,08,600గా నమోదైంది.

బంగారం పరిమాణం -24 క్యారెట్లు -22 క్యారెట్లు
1 గ్రాము -రూ.14,475 (+రూ.115) – రూ.13,270 (+రూ.95)
8 గ్రాములు -రూ.1,15,800 (+రూ.920) -రూ.1,06,160 (+రూ.760)
10 గ్రాములు -రూ.1,44,750 (+రూ.1,150) -రూ.1,32,700 (+రూ.950)

హైదరాబాద్‌లో వెండి ధర ఎంతంటే?

బంగారం ధరలతో పాటు వెండి ధర కూడా కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.2,05,000గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కిలో సిల్వర్ రూ.2,05,000గా ఉంది.