NTV Telugu Site icon

Gold Price Today : పరుగులు పెడుతున్న పసిడి ధరలు.. ఈరోజు తులం ఎంతంటే?

Gold (3)

Gold (3)

దీపావళికి కాస్త దిగొచ్చిన పసిడి ధరలు గత రెండు రోజులుగా పరుగులు పెడుతున్నాయి.. ఈరోజు కూడా మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు షాక్ ఇస్తున్నాయి.. వెండి కూడా ఈరోజు బంగారం బాటలోనే నడిచింది.. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 పెరగ్గా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 440 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040 లుగా ఉంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. వెండి కిలో ధర రూ.1700 మేర పెరిగి .. 74,700 లుగా కొనసాగుతోంది.. ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,190 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,950, 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.55,950, 24 క్యారెట్లు రూ.61,040 నమోదు అవుతుంది..
*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,450, 24 క్యారెట్ల ధర రూ.61,580 వద్ద నడుస్తుంది..
*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950, 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది..
*. ఇక తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధర చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55, 950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది…

వెండి విషయానికొస్తే.. ఈరోజు వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. కిలో వెండి పై ఏకంగా..రూ.1700 మేర పెరిగింది.. ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,700 గా ఉంది. ముంబైలో రూ.74,700 ఉండగా.. చెన్నైలో రూ.77,700, బెంగళూరులో రూ.71,500గా ఉంది.. కేరళలో రూ.77,700, కోల్‌కతాలో రూ.74,700 లుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.77,700గా నమోదు అయ్యింది.. మొత్తానికి ఈరోజు బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. మరి రేపు ఎలా ఉంటాయో చూడాలి..