Site icon NTV Telugu

Gold Rates: గోల్డ్ లవర్స్‌కు బిగ్ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధర

Gold

Gold

పసిడి ప్రియులకు మళ్లీ షాక్. యుద్ధం సమయంలో బంగారం ధరలు ఝలక్ ఇచ్చాయి. ఓ వైపు పెళ్లిళ్లు.. ఇంకోవైపు యుద్ధంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఇలాంటి తరుణంలో గోల్డ్ రేట్స్ పెరగడంతో సామాన్యుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ వారంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టినా.. ఈరోజు మాత్రం భారీగా పెరిగిపోయింది. తులం గోల్డ్‌పై రూ. 2,510 పెరగగా.. వెండి ధర మాత్రం ఉపశమనం కలిగించింది.

తులం గోల్డ్‌పై రూ.2,510 పెరగడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,63,640 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.2,300 పెరగడంతో రూ.1,50,000 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,880 పెరగడంతో రూ.1,22,730 దగ్గర ట్రేడ్ అవుతోంది.

హమ్మయ్య.. ఈరోజు సిల్వర్ ధర శాంతించింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.2,85, 000 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,90,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి రూ.2,85, 000 దగ్గర అమ్ముడవుతోంది.

Exit mobile version