Site icon NTV Telugu

Gold and Silver Rate Today: పసిడి ప్రేమికులకు గుడ్‌న్యూస్‌..

Gold

Gold

పసిడి కొనుగోలు చేయాలని అని చూస్తున్నవారికి శుభవార్త.. వరుసగా పెరుగుతూ పోయిన బంగారం ధరలు.. నిన్నటి నుంచి మళ్లీ తగ్గుముఖం పట్టాయి.. నిన్న ఏకంగా 10 గ్రాముల బంగారం దాదాపు వెయ్యి రూపాయల వరకు తగ్గగా.. ఇవాళ కూడా మరింత కిందకు దిగివచ్చింది.. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో ఇవాళ 10 గ్రాముల బంగారం ధర రూ.100 నుంచి రూ.120 వరకు తగ్గింది. ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.46,900గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 51,160గా పలుకుతోంది.. ఇదే సమయంలో వెండి కూడా కాస్త దిగివచ్చింది.. సోమవారంతో పోలిస్తే కిలో వెండి ధర రూ.100 మేర తగ్గడంతో రూ.60,400 దగ్గర అమ్మకాలు సాగిస్తున్నారు.

Read Also: Samantha: ప్రస్తుతానికి నేను చావలేదు.. కన్నీరు పెట్టుకున్న సమంత

ఇక, ఇవాళ దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన బంగారం ధరలను ఓసారి పరిశీలిస్తే.. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరరూ.46,900గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,160గా ఉంది.. విజయవాడలో అయితే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160కి చేరింది.. మరోవైపు, ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,050గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,330గా ఉండగా.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 వద్ద కొనసాగుతోంది.. ముంబైలో అయితే, 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ట్రేడ్‌ అవుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,900గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160గా ఉంది.. ఇక, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210గా అమ్మకాలు సాగిస్తున్నారు.

Exit mobile version