Site icon NTV Telugu

Gold and Silver Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. ఇవాళ బంగారం ధరలు ఇలా..

Gold And Silver

Gold And Silver

బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.. ఎందుకంటే.. పసిడి ధరలు మరింత కిందకు దిగివచ్చాయి… వరుసగా మూడు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇవాళ కూడా మరింత కిందకు దిగివచ్చాయి.. నిన్నటితో పోలిస్తే ఇవాళ స్వల్పంగా తగ్గింది పసిడి ధర.. ఇదే సమయంలో వెండి ధర పెరిగింది.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 దిగివచ్చింది.. ఇదే సమయంలో.. కిలో వెండి ధర ఏకంగా రూ.600 ఎగబాకింది.. దేశంలోని వివిధ నగరాల్లో ఇవాళ పసిడి ధరకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..

Read Also: Mallareddy IT Raids : రెండో రోజు కొనసాగాతున్న ఐటీ సోదాలు.. షిఫ్ట్స్ వైజ్‌గా ఐటీ అధికారుల తనిఖీలు

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,500గా.. 24 క్యారెట్ల 10 బంగారం ధర రూ.52,900గా కొనసాగుతోంది.. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,350గా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750గా ఉంది.. పుణెలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,350గా ఉంటే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750గా ఉంది.. ఇక, హైదరాబాద్‌లో బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,350 పలుకుతుండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 52,750గా ఉంది.. ఇక, హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 67,000గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ48,350గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,750గా ట్రేడ్‌ అవుతోంది..

Exit mobile version