Site icon NTV Telugu

Gold Rates: మగువలకు శుభవార్త.. నేడు బంగారం, వెండి ధరలు ఇలా!

Gold

Gold

పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభావం బంగారం, వెండి ధరలపై కూడా ఉంటుందని భయాందోళన చెందారు. కానీ అందుకు భిన్నంగా ధరలు దిగొస్తున్నాయి. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి బంగారం, వెండి ధరలు దిగొచ్చాయే తప్ప అంతగా పెరిగిన దాఖలాలు లేవు. తాజాగా మరోసారి దిగొచ్చాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.100 తగ్గగా.. కిలో వెండిపై రూ.100 తగ్గింది. మొత్తానికి పెళ్లిళ్ల సీజన్‌లో మగువలకు.. సామాన్యులకు శుభవార్తగానే చెప్పొచ్చు.

తులం గోల్డ్‌పై రూ.100 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,48,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై రూ.10 తగ్గడంతో రూ.1,36,540 దగ్గర అమ్ముడవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.10 తగ్గడంతో రూ.1,11,720 దగ్గర ట్రేడ్ అవుతోంది.

సిల్వర్ ధర కూడా ఊరట కలిగించింది. కిలో వెండి ధరపై రూ.100 తగ్గడంతో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.2,54, 900 దగ్గర అమ్ముడవుతోంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,59,900 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరులో మాత్రం కిలో వెండి ధర రూ.2,54, 900 దగ్గర అమ్ముడవుతోంది.

Exit mobile version