Gold ans Silver Prices: దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. శుక్రవారం నుంచి శ్రావణమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో బంగారం ధరలు పెరగడం ఓ రకంగా షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ మాసంలో శుభాకార్యాలు భారీస్థాయిలో జరుగుతాయి. దీంతో పసిడికి ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే పసిడికి రెక్కలు రావడంతో ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలని భావించిన వాళ్లు ఊసురుమంటున్నారు. ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో నెలకొన్న అనిశ్చితులు, బంగారం ధరల హెచ్చుతగ్గులకు కారణాలుగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ. 650 పెరిగి రూ. 47,100కు చేరింది. అటు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 700 పెరిగి రూ.51,380కి చేరింది. హైదరాబాద్, విశాఖ బులియన్ మార్కెట్‌లోనూ ఇవే ధరలు ఉన్నాయి.
Read Also: Man didnot bath for 22 years: 22 ఏళ్లుగా స్నానం చేయలేదు.. కారణం తెలిస్తే షాకవుతారు!
అటు తమిళనాడులోని చెన్నైలో 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,670గా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 52,000గా నమోదైంది. మహారాష్ట్రలోని పూణెలో 22 క్యారెట్ల బంగారం రూ. 47,130గా.. 24 క్యారెట్ల పసిడి రూ. 51,410గా ఉంది. దేశంలో వెండి ధరలు సైతం శుక్రవారం భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర ఏకంగా రూ. 1,900 పెరిగి.. రూ. 56,500కు చేరింది. గురువారం ఈ ధర రూ. 54,600గా ఉండేది. హైదరాబాద్ నగరంలో కేజీ వెండి ధర రూ. 61,200 పలుకుతోంది. కోల్‌కతా మార్కెట్‌లో రూ. 56,500, బెంగళూరులో రూ.61,200.. ముంబైలో రూ.56,500.. చెన్నైలో రూ.61,200గా కిలో వెండి ధర నమోదైంది. అయితే ప్లాటినం రేట్లు మాత్రం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల ప్లాటినం ధర రూ. 310 తగ్గి.. రూ. 22,400కి చేరింది. గురువారం ఈ ధర రూ. 22,710గా ఉండేది.