దేశంలో బంగారం ధరలు అదుపులోనే ఉన్నాయి. కరోనా లాక్ డౌన్ సమయంలో భారీ స్థాయిలో ధరలు ఉండగా, ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దాదాపుగా 11 వేలకు పైగా బంగారం తగ్గింది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ. 43,750కి చేరింది. 10 గ్రాముల 24 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.47,730కి చేరింది. ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనించింది. కిలో వెండి ధర రూ.1300 తగ్గి రూ.74,400 కి చేరింది.