Gautam Thapar: ‘అవంత’ గ్రూప్ ప్రమోటర్ మరియు సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ మాజీ చైర్మన్ గౌతమ్ థాపర్‌కి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా 10 కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది. సీజీ పవర్ అండ్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ నుంచి నిధులను దారిమళ్లించారనే ఆరోపణలకు సంబంధించిన కేసులో తుది ఆదేశాలను జారీ చేసింది. గౌతమ్ థాపర్‌కే కాకుండా అవంత హోల్డింగ్స్‌కి 5 కోట్లు, ఇండస్‌ఇండ్ బ్యాంక్ మరియు ఆదిత్య బిర్లా ఫైనాన్స్‌కి కోటి రూపాయల చొప్పున జరిమానా విధించింది. క్యాపిటల్ మార్కెట్‌లో కార్యకలాపాలు నిర్వహించకుండా గౌతమ్ థాపర్‌ని మరియు అవంత హోల్డింగ్స్‌ని ఐదేళ్లపాటు నియంత్రించింది.
ఇవాళే జియో 5జీ ట్రయల్స్
రిలయెన్స్ జియో సంస్థ ఈ రోజు 5జీ బీటా ట్రయల్స్ వేయనుంది. నాలుగు సిటీల్లో ఈ సర్వీస్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించనుంది. ఇందులో భాగంగా సెలెక్టెడ్ కస్టమర్లకు ఒక జీబీపీఎస్ వరకు వేగంతో కూడిన అన్‌లిమిటెడ్ డేటాను అందించనుంది. రిలయెన్స్ జియో 5జీ సర్వీసులు దీపావళి పండుగ నాటి నుంచి అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇవాళ ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిల్లో ట్రయల్స్‌కి తెరతీసింది.
read also: Gold Supplying Banks: భారత్‌కు బంగారం బంద్. అందుకే రేట్లు పెరిగాయా?
షాప్సీకి 6 రెట్లు పెరిగిన కస్టమర్లు
ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సోషల్ బిజినెస్ యూనిట్ షాప్సీకి పండుగ సీజన్ సేల్స్ నేపథ్యంలో కస్టమర్లు 6 రెట్లు పెరిగారు. దీంతో ఆర్డర్లు కూడా అదే స్థాయిలో వచ్చాయి. జులై నెలలో ఈ కంపెనీ యాప్ డౌన్‌లోడ్స్ సంఖ్య 100 మిలియన్లు దాటింది. ఇందులో దాదాపు 80 శాతం మంది ‘ది బిగ్ బిలియన్ డే’ సందర్భంగా వెబ్‌సైట్‌ని విజిట్ చేశారు. సుమారు 65 శాతం ఆర్డర్లు టయర్-2 సిటీల నుంచి మరియు అంతకన్నా దిగువ స్థాయి పట్టణాల నుంచి వచ్చాయి. ఈ వివరాలను ఫ్లిప్‌కార్ట్ న్యూ బిజినెస్ హెడ్ అండ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆదర్శ్ మీనన్ వెల్లడించారు.
