NTV Telugu Site icon

Satya Nadella : మైక్రోసాఫ్ట్‌ AI రీసెర్చ్ టీమ్‌ని ఇక వీరిద్దరే లీడ్ చేస్తారు.. సీఈవో సత్య నాదెళ్ల

Untitled 13

Untitled 13

Former Open AI CEO Sam Altman: ప్రతిభ ఉంటె అవకాశం దానంతట అదే వెతుకుంటూ వస్తుంది. అనడానికి సామ్ ఆల్ట్‌మన్‌ ఓ ఉదాహరణ. సామ్ ఆల్ట్‌మన్‌ ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. Open AI సంస్థ CEO గా విధులు నిర్వహించారు ఈయన. కాగా కొన్ని కారణాల చేత ఆల్ట్‌మన్‌ న్ని CEO విధుల నుండి తొలిగించారు. కాగా ఈయన్ని విధుల నుండి తొలిగించాక ఆయన సహా ఉద్యోగి అయినటువంటి గ్రెగ్ బ్రాక్‌మన్‌ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అలానే మరో ముగ్గురు కూడా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చారు. మరి కొంత మంది ఉద్యోగానికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అయితే Open AI సంస్థ మాజీ CEO సామ్ ఆల్ట్‌మన్‌, అలానే గ్రెగ్ బ్రాక్‌మన్‌ మైక్రోసాఫ్ట్ లో చేరనున్నారు.

Read also:Etala Rajender: మేము ఫైటర్లమే.. బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదు..

ఈ విషయం స్వయంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల X వేదికగా ప్రకటించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల X లో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఇద్దరు OpenAI మాజీ ఉద్యోగులు అయినటువంటి ఆల్ట్‌మన్‌, గ్రెగ్ బ్రాక్‌మన్‌ మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో చేరుతున్నారని.. కాగా ఇక పై AI రీసెర్చ్ టీమ్‌ని వీళ్లిద్దరూ కలిసి లీడ్ చేస్తారని.. ఈ నేపథ్యంలో వాళ్లకు కావాల్సిన వనరులను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. కాగా సత్య నాదెళ్ల పోస్ట్‌ను సామ్ ఆల్ట్‌మాన్ షేర్ చేస్తూ.. ఆ పోస్ట్‌ కు ‘ది మిషన్ కంటిన్యూస్’ అని పిన్ చేశారు.

Show comments