Site icon NTV Telugu

Forbes Billionaires List 2022 : అగ్రస్థానంలో ముఖేష్ అంబానీ..

Mukesh Ambani

Mukesh Ambani

భారత్‌లోని అత్యంత సంపన్నుల టాప్‌ 10 జాబితాను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. భార‌తీయ‌ కుబేరుల్లో రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ ముఖేశ్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతం అదానీ ఉండగా, మూడవ స్థానంలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ చైర్మన్‌ శివ్‌ నాడార్‌ నిలిచారు. అయితే ఈ మూడు స్థానాల్లో గతేడాది కూడా ఇదే విధంగా వీరే ముగ్గురు ఉన్నారు. కానీ.. ముఖేశ్‌ అంబాని వ్య‌క్తిగ‌త సంప‌ద 90.7 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరుకుంద‌ని, అలాగే గౌతం అదానీ 90 బిలియ‌న్ల డాల‌ర్ల‌తో, శివ్ నాడార్ 28.7 బిలియ‌న్ డాల‌ర్ల వ్య‌క్తిగ‌త సంప‌ద‌తో మూడో అగ్ర‌శ్రేణి కుబేరుడ‌య్యారు. దీంతో పాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ముఖేష్ అంబానీ 10వ స్థానంలో నిలిచినట్లు ఫోర్బ్స్‌ వెల్లడించింది.

గౌతమ్‌ అదానీ మొత్తం 90 బిలియన్ డాలర్ల సంపదతో ఆసియాలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా నిలిచారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్స్‌ ఉత్పత్తి చేస్తోన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు సైరస్ పూనావాలా 24.3 బిలియన్ల డాలర్ల నికర విలువతో 4వ స్థానంలో ఉండగా, డీమార్ట్‌ వ్యవస్థాపకుడు రాధాకిషన్‌ దమానీ 20 బిలియన్‌ డాలర్ల నికర విలువతో 5 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. వీరితో పాటు స్టీల్‌ కంపెనీ ఆర్సెలర్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ 6వ స్థానం, జిందాల్ గ్రూప్ మాతృక సావిత్రి జిందాల్ 7వ స్థానం, ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార్ బిర్లా 8వ స్థానం, సన్ ఫార్మాస్యూటికల్స్ హెడ్ దిలీప్ షాంఘ్వీ 9వ స్థానం, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ 10వ స్థానంలో నిలిచారు. గతేడాది 140గా భారత్‌లో బిలియనీర్ల సంఖ్య ఉండగా ఇప్పుడు 166కు చేరుకుందని ఫోర్బ్స్ నివేదించింది.

Exit mobile version