ఈ-కామర్స్ సంస్థలు అప్పుడప్పుడు సందర్భాన్ని బట్టి ప్రత్యేక ఆఫర్లు తెస్తూనే ఉంటాయి.. పండగల సీజన్ వచ్చినా.. ఇంకా ఏదైనా ప్రత్యేకమైన రోజు వస్తున్నా.. ముందే ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తారు.. తాజాగా.. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రారంభిస్తోంది.. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో మే 2 నుంచి మే 7వ తేదీ వరకు కొనసాగనుంది ఈ ప్రత్యేక సేల్.. ఇక, ప్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అయితే, ఒకరోజు ముందుగానే అంటే.. మే 1వ తేదీ అర్ధరాత్రి నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సేల్‌లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, టాబ్లెట్లు, ఆడియో డివైజ్‌లు, హెడ్‌ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు… ఇలా ఎలక్ట్రానిక్ గూడ్స్‌పై భారీ డిస్కౌంట్లు తీసుకొస్తోంది ఫ్లిప్‌కార్ట్..
ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీలపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్ లభించనుండగా.. ఎక్స్చేంజ్ ఆఫర్లు కూడా తెస్తుంది.. మరోవైపు.. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్స్ గూడ్స్‌పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్నికూడా తీసుకొస్తుంది. యాపిల్, వివో, ఆసుస్, షియోమీ లాంటి పలు కంపెనీలకు చెందిన ఉత్పత్తులు ఈ సేల్‌లో అందుబాటులో ఉండనున్నాయి.. ఎలక్ట్రానిక్స్, ఉపకరణాలపై 80 శాతం వరకు.. టెలివిజన్ సెట్లు, అప్లయెన్సెస్‌పై 75 శాతం వరకు తగ్గింపు ఉండనుండగా.. ఇక, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులపై లావాదేవీలు చేసేవారు 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్లు పొందే అవకాశం కూడా ఉంది. ఇది కరోనా సమయం కాబట్టి.. ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి… నచ్చినవి కొనుకోండి అంటోంది ఫ్లిప్‌కార్ట్..