ఫైనాన్షియల్ టైమ్స్ మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ (FT MiM) 2024 గ్లోబల్ ర్యాంకింగ్స్ ఆదివారం విడుదల అయ్యాయి. అంతర్జాయతీ ర్యాంకింగ్స్‌లో భారతీయ వ్యాపార పాఠశాలలు బలమైన ఉనికిని చాటుకున్నాయి. భారతీయ విద్యాభవన్‌కు చెందిన ఎస్‌పీ జైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్ (SPJIMR) ప్రపంచవ్యాప్తంగా 35వ ర్యాంకు సాధించి అగ్రస్థానంలో చోటు సంపాదించుకుంది. మూడు భారతీయ సంస్థలు టాప్ 50లో చోటు దక్కించుకున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్ (IIM A) మరియు IIM బెంగుళూరు వరుసగా 39వ మరియు 41వ స్థానాల్లో ఉన్నాయి.
మొత్తంగా 2024 జాబితాలో 100 ర్యాంకుల్లో 21 భారతీయ ఇన్‌స్టిట్యూట్‌లు ర్యాంకులు సంపాదించాయి. IIM లక్నో ప్రపంచవ్యాప్తంగా 55వ స్థానంలో ఉంది. IIM కలకత్తా 56వ స్థానంలో ఉంది. XLRI – జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ 65వ స్థానంలో ఉండగా.. IIM కోజికోడ్ 68వ స్థానంలో ఉంది. SCMHRD (76వ), IIM ఉదయపూర్ (81వ), IIM ఇండోర్ (83వ), మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ గుర్గావ్ (85వ), ఇంటర్నేషనల్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ న్యూ ఢిల్లీ (86వ), NMIMS ముంబై (94వ) మరియు మేనేజ్‌మెంట్ టెక్నాలజీ ఘజియాబాద్ (97వ స్థానం). ఇలా టాప్ 100లో భారతీయ విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా స్విట్జర్లాండ్‌లోని సెయింట్ గాలెన్ విశ్వవిద్యాలయం అగ్రస్థానంలో ఉంది. ఫ్రాన్స్‌కు చెందిన HEC పారిస్, ఇన్‌సీడ్ మరియు ఎడెక్ బిజినెస్ స్కూల్ రెండు మూడవ మరియు నాల్గవ స్థానాలను పొందాయి. చైనాకు చెందిన షాంఘై జియావో టోంగ్ విశ్వవిద్యాలయం మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది.
టాప్ 10 ఇన్‌స్టిట్యూట్‌లలో ఆరు ఫ్రాన్స్‌కు చెందినవి కాగా.. 24 ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్‌లు టాప్ 100లో ఉన్నాయి. చైనా జాబితాలో కేవలం రెండు ఇన్‌స్టిట్యూట్‌లు మాత్రమే ఉన్నాయి. షాంఘై జియావో టోంగ్ యూనివర్సిటీ. అంటాయ్ మరియు టోంగ్జీ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ మేనేజ్ స్కూల్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇనిస్టిట్యూట్లకే ఈ ర్యాంకులు లభిస్తాయి.