PAN Card : మీ పాన్ కార్డులో దాగున్న సీక్రెట్ తెలుసా.. ఆ 10 అంకెల అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PAN Card : ఆర్థిక లావాదేవీల నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుల వరకు ఈరోజుల్లో ‘పాన్ కార్డ్’ (PAN Card) అనేది మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయింది. బ్యాంకు ఖాతా తెరవాలన్నా, ఆస్తులు కొనాలన్నా, డీమాట్ అకౌంట్ కావాలన్నా ఈ 10 అంకెల పర్మినెంట్ అకౌంట్ నెంబర్ తప్పనిసరి అయ్యింది. అయితే, మీ కార్డుపై ఉండే ఆ 10 డిజిట్స్ వెనుక ఒక ప్రత్యేకమైన కోడ్ లాంగ్వేజ్ ఉంటుందని మీకు తెలుసా? మీ పాన్ కార్డ్ సీక్రెట్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Trump: రేపు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్న ట్రంప్.. సర్వత్రా ఉత్కంఠ
Also Read
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
- UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
- ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే ప్రతి పాన్ నెంబర్లో ఇంగ్లీష్ అక్షరాలు, అంకెలు కలిపి ఉంటాయి. దీనిని ఐదు విభాగాలుగా విభజించవచ్చు.. అందులో మొదటిది.
1. మొదటి మూడు అక్షరాలు (AAA నుండి ZZZ):
పాన్ కార్డులోని మొదటి మూడు డిజిట్లు ఎల్లప్పుడూ ఆల్ఫాబెటిక్ సిరీస్‌లో ఉంటాయి. ఇవి ‘AAA’ నుంచి ‘ZZZ’ వరకు ఏదైనా కావచ్చు. ఇవి కంప్యూటర్ ద్వారా రాండమ్‌గా జనరేట్ చేయబడతాయి.
2. నాలుగో అక్షరం (పాన్ హోల్డర్ స్టేటస్):
ఇది చాలా ముఖ్యమైనది. కార్డు తీసుకున్నది వ్యక్తియా లేక సంస్థా అనేది ఈ నాలుగో అక్షరం ద్వారానే తెలుస్తుంది.
P – Person: వ్యక్తిగతంగా తీసుకుంటే ‘P’ అని ఉంటుంది.
C – Company: ఏదైనా కంపెనీ పేరు మీద ఉంటే ‘C’ అని ఉంటుంది.
H – HUF: హిందూ అవిభాజ్య కుటుంబం అయితే ‘H’ అని ఉంటుంది.
F – Firm: పార్టనర్షిప్ సంస్థలకు ‘F’ అని ఉంటుంది.
T – Trust: ట్రస్టుల పేరు మీద ఉంటే ‘T’ అని ఉంటుంది.
G – Government: ప్రభుత్వ సంస్థలకు ‘G’ అని ఉంటుంది.
3. ఐదో అక్షరం (మీ ఇంటి పేరు లేదా పేరులోని మొదటి అక్షరం):
మీరు వ్యక్తిగత పాన్ కార్డ్ (P) కలిగి ఉంటే, మీ ఐదో అక్షరం మీ ఇంటి పేరులోని (Surname) మొదటి అక్షరంగా ఉంటుంది. ఉదాహరణకు, మీ పేరు ‘పులిపాటి రమేష్’ అయితే, ఐదో అక్షరం ‘P’ అని ఉంటుంది. అదే కంపెనీ అయితే, ఆ కంపెనీ పేరులోని మొదటి అక్షరం ఇక్కడ వస్తుంది.
4. ఆరు నుంచి తొమ్మిది వరకు అంకెలు (0001 నుంచి 9999):
మధ్యలో ఉండే ఈ నాలుగు అంకెలు ఒక సీక్వెన్షియల్ నెంబర్స్. ఇవి 0001 నుంచి 9999 మధ్య ఏదైనా ఉండవచ్చు.
5. పదవ అక్షరం (ఆల్ఫాబెటిక్ చెక్ డిజిట్):
పాన్ నెంబర్లోని చివరి అక్షరం ఎప్పుడూ ఆల్ఫాబెటిక్ రూపంలోనే ఉంటుంది. ముందుగా ఉన్న 9 డిజిట్లకు ఒక నిర్దిష్ట ఫార్ములాను అప్లై చేసి, కంప్యూటర్ ఈ పదవ అక్షరాన్ని సృష్టిస్తుంది.
కేవలం ఒక నెంబర్ లాగా కనిపించే మీ పాన్ కార్డ్, ఆదాయపు పన్ను శాఖ డేటాబేస్‌లో మీ పూర్తి గుర్తింపును ఇలా కోడ్ రూపంలో నిక్షిప్తం చేస్తుంది. అందుకే పాన్ నెంబర్ కేవలం అంకెలు మాత్రమే కాదు.. అది మీ ఆర్థిక చిరునామా అని ఆర్థిక విశ్లేషకులు చెబుతారు.
READ ALSO: Airtel Rs 48 Plan : ఎయిర్టెల్ నుంచి అదిరిపోయే ప్లాన్.. ఈ ఆఫర్ తెలిస్తే యూజర్లు అస్సలు వదలరు!
తాజావార్తలు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?