Site icon NTV Telugu

Charges on UPI Transactions: పేటీఎం, ఫోన్‌పే, గూగుల్ పే సహా యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు..! ఇలా క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

Upi Transactions

Upi Transactions

ఇప్పుడు క్యాష్‌ వాడకం తగ్గిపోయింది.. ప్రతీ చిన్నా చితక అవరాల కోసం బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేసేవారు తగ్గిపోయారు.. ఎందుకంటే.. ఎక్కడికి వెళ్లినా డిజిటల్‌ పేమెంట్స్‌ ఈజీగా చేసే అవకాశం ఉంది.. పేటీఎం, ఫోన్‌పే, గూగుల్‌ పే, భారత్‌ పే.. ఇలా ఎన్నో రకకాల యూపీఐ పేమెంట్లు అందుబాటులోకి వచ్చాయి.. టీ తాగినా, కూరగాయలు కొన్నా.. చివరకు సిగరేట్‌ కొనాలన్నా.. ఇలా ఒక్కటేంటి.. సర్వం యూపీఐ పేమెంట్ల మయం అన్నట్టు పరిస్థితి తయారైంది. అయితే, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే లావాదేవీలపై టైర్డ్ ఛార్జీలు విధించే అవకాశంతో సహా చెల్లింపుల వ్యవస్థలో ప్రతిపాదించిన వివిధ మార్పులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రజల నుండి అభిప్రాయాన్ని ఆహ్వానించింది. డిసెంబర్ 08, 2021 నాటి డెవలప్‌మెంటల్ అండ్ రెగ్యులేటరీ పాలసీలపై స్టేట్‌మెంట్‌లో ప్రకటించినట్లుగా, ఆర్బీఐ పబ్లిక్ ఫీడ్‌బ్యాక్ కోసం “చెల్లింపు వ్యవస్థలలో ఛార్జీలు” అనే అంశంపై చర్చా పత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.. దీంతో, యూపీఐ లావాదేవీలపై ఛార్జీల వడ్డింపు తప్పదా? అనే ఆందోళన మొదలైంది. అయితే, దీనిపై క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ.. యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించే ఆలోచన లేదని స్పష్టం చేసింది.

Read Also: Amit Shah and Junior NTR Meet: అమిత్‌షా-ఎన్టీఆర్‌ భేటీ… కొత్త చర్చకు తెరలేపిన కొడాలి నాని..!

‘కాస్ట్ రికవరీ కోసం సర్వీస్ ప్రొవైడర్ల ఆందోళనలను ఇతర మార్గాల ద్వారా తీర్చాలి’ అంటూ ట్వీట్‌ చేసింది ఆర్థిక శాఖ.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ద్వారా చెల్లింపులు చేయడానికి ఎటువంటి ఛార్జీలు విధించే ఆలోచన లేదని కేంద్రం ఆదివారం తెలిపింది, అయితే ఈ సేవ “అపారమైన సౌలభ్యంతో కూడిన డిజిటల్ పబ్లిక్ గుడ్”గా పేర్కొంది. కాస్ట్ రికవరీ కోసం సర్వీస్ ప్రొవైడర్ల ఆందోళనలను ఇతర మార్గాల ద్వారా తీర్చాల్సి ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.. యూపీఐ అనేది ప్రజలకు అపారమైన సౌలభ్యం మరియు ఆర్థిక వ్యవస్థకు ఉత్పాదకత లాభాలతో కూడిన డిజిటల్ పబ్లిక్ గూడ్. ఈ సేవలకు ఛార్జీలు విధించేందుకు ప్రభుత్వంలో ఎటువంటి పరిశీలన లేదు. కాస్ట్ రికవరీ కోసం సర్వీస్ ప్రొవైడర్ల ఆందోళనలను ఇతర మార్గాల ద్వారా తీర్చాలి అంటూ ట్వీట్‌ చేసింది.

ఆర్బీఐ వివిధ మొత్తాల బ్యాండ్‌ల ఆధారంగా యూపీఐ ద్వారా చేసే చెల్లింపులపై క్రమంగా ఛార్జీలు విధించే అవకాశంపై వాటాదారుల నుండి అభిప్రాయాన్ని కోరిన కొద్ది రోజుల తర్వాత దీనిపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. యూపీఐ, ఐఎంపీఎస్‌, ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్‌ వంటి విభిన్న చెల్లింపు సేవలు లేదా కార్యకలాపాల కోసం ఛార్జీల ఫ్రేమ్‌వర్క్‌ను క్రమబద్ధీకరించడానికి ఆర్బీఐ అభిప్రాయాలు కోరంది. డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు మరియు ప్రీపెయిడ్ చెల్లింపు సాధనాలు సహా అన్నింటిపై అక్టోబర్ 3 నాటికి ప్రతిపాదనలు, అభిప్రాయాన్ని కోరినప్పటికీ, ఆ అంశాలపై ఎటువంటి అభిప్రాయాన్ని లేదా నిర్దిష్ట అభిప్రాయాన్ని తీసుకోలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ప్రస్తుతం, యూపీఐ ద్వారా చేసిన చెల్లింపుల విషయంలో వినియోగదారులు లేదా వ్యాపారులకు ఎలాంటి ఛార్జీలు ఉండభోవని పేర్కొంది.

డిజిటల్ చెల్లింపులు పర్యావరణ వ్యవస్థకు తోడ్పడిందని.. డిజిటల్ చెల్లింపులను మరింతగా స్వీకరించడానికి ఆర్థిక మరియు వినియోగదారు-స్నేహపూర్వక చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌లను ప్రోత్సహించడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా అదే విధమైన కృషి అవసరమని కేంద్రం పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో, రూపే డెబిట్ కార్డ్ లావాదేవీలకు మర్చంట్ తగ్గింపు రేటు (ఎండీఆర్) మరియు రూ. 2,000 వరకు బీహెచ్‌ఐఎం-యూపీఐ లావాదేవీలకు తిరిగి చెల్లించడానికి ఉపయోగించే “డిజిటల్ చెల్లింపుల ప్రమోషన్” కోసం కేంద్రం రూ. 1,500 కోట్లను కేటాయించింది. ఆర్థిక సంవత్సరం 2023 కోసం బడ్జెట్‌లో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్రం రూ.200 కోట్లు కేటాయించింది.

Exit mobile version