ఫేస్‌బుక్ ప్రారంభం నుంచి మెసెంజర్‌కు మంచి డిమాండ్ ఉన్నది. షార్ట్ మెసేజింగ్ కోసం దీనిని వినియోగించేవారు. అయితే, వాట్సప్ అందుబాటులోకి వచ్చిన తరువాత మెసెంజర్ వాడకం తగ్గిపోయింది. అయితే, మెసెంజర్‌లో భారీ మార్పులు చేసి వినియోగదారులకు అందించేందుకు ఫేస్‌బుక్ సిద్దమయింది. ఇకపై మెసెంజర్ చాట్‌లో స్క్రీన్ షాట్ తీస్తే సదరు వినియోగదారుడిని అలర్ట్ చేస్తూ మెసేజ్ వెళ్తుంది. దంతో చాట్ చేసేవారు అలర్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. చాట్‌పై పలు ఫిర్యాదులు అందుతున్న సమయంలో ఫేస్‌బుక్ ఈ నిర్ణయం తీసుకున్నది. అంతేకాదు, వాట్సప్ మాదిరిగానే ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ సెక్యూరిటీని కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నది. దీంతో పాటుగా ఫొటోలు, విడియోలను లాంగ్ ప్రెస్ చేయడం ద్వారా సేవ్ చేసుకొవచ్చు, షేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మెసెంజర్ చాట్ ద్వారా వీడియో, ఆడియోను ఎడిట్ చేసుకొని షేర్ చేసుకునే విధంగా కొత్త ఆప్షన్‌ను తీసుకొచ్చేందుకు ఫేస్‌బుక్ సిద్దం అవుతున్నది.
ఫేస్‌బుక్ మెసెంజర్‌లో భారీ మార్పులు… ఇకపై స్క్రీన్‌షాట్ తీస్తే…
