Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Facebook Plans To Change Its Name On October 28th

‘ఫేస్‌బుక్’ పేరు మారుతోంది.. వచ్చేవారం కొత్త పేరు ప్రకటన

Published Date :October 20, 2021 , 5:44 pm
By Ramesh Nalam
‘ఫేస్‌బుక్’ పేరు మారుతోంది.. వచ్చేవారం కొత్త పేరు ప్రకటన
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రపంచంలో కోట్ల మంది ప్రజలు సోషల్ మీడియాను వాడుతున్నారు. అందులో ఫేస్‌బుక్ ఒకటి. చాలా మంది తమ అభిప్రాయాలను ఇతరులతో షేర్ చేసుకోవడానికి ఫేస్ బుక్‌ను ఉపయోగిస్తుంటారు. కొందరు దీని ద్వారా వ్యాపారాలు కూడా చేసుకుంటున్నారు. ఇటీవల ఫేస్‌బుక్ సేవలు ఆరు గంటలు నిలిచిపోగా ప్రపంచమే స్తంభించినంతగా మారిపోయింది. ఇంతలా ప్రజలతో అనుసంధానమైన ఫేస్‌బుక్ త్వరలో తన పేరును మార్చుకుంటోంది. ఈనెల 28న ఫేస్‌బుక్ వార్షిక సమావేశం జరగనుంది. ఈ భేటీలో ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కొత్త పేరును ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. వర్క్ ప్లేస్ కొలాబరేషన్ కోసం ఫేస్‌బుక్ ఇటీవల ‘హొరైజన్ వర్క్ రూమ్స్’ అనే కాన్సెప్టును పరిచయం చేసింది. దీంతో ‘హోరైజన్’ అనే కొత్త పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కాగా ఇప్పటికే వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఆక్యులస్ వంటివి ఫేస్‌బుక్‌లో భాగంగా ఉన్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్ తన కార్యకలాపాలను మరింత విస్తరించుకునే పనిలో పడింది. ప్రస్తుతం ఏఆర్ (ఆగ్మెంటెడ్ రియాలిటీ) అద్దాల తయారీలో సంస్థ బిజీగా ఉంది. దీని కింద కొత్తగా రానున్న ఐదేళ్లలో యూరోపియన్ యూనియన్‌లో (ఈయూ)లో 10 వేల మంది ఉద్యోగులను నియమించుకోనుంది. స్మార్ట్ ఫోన్‌ల తరహాలో భవిష్యత్తులో ఏఆర్ గ్లాసెస్ కూడా ప్రజల జీవితాల్లో భాగం అవుతాయని ఫేస్‌బుక్ సంస్థ ఆశిస్తోంది. మరోవైపు మెటావర్స్ ప్రాజెక్టు కోసం ఫేస్‌బుక్ 50 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Facebook
  • Mark Zuckerberg
  • name change
  • social media

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions