NTV Telugu Site icon

Susan Wojcicki: క్యాన్సర్‌తో యూట్యూబ్‌ మాజీ సీఈవో మృతి.. స్పందించిన సుందర్‌ పిచాయ్‌

Susan

Susan

Susan Wojcicki: యూట్యూబ్‌ మాజీ సీఈవో సుసాన్‌ వోజ్‌కికీ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 56 ఏళ్లు.. సుసాన్‌ మరణవార్తను ఆమె భర్త డెన్నిస్ ట్రోపర్ సోషల్‌ మీడియా వేదికగా ధృవీకరించారు. ఈ మేరకు భావోద్వేగపూరితమైన పోస్ట్‌ పెట్టారు. రెండేళ్లుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌ తో పోరాటం చేసిన ఆమె.. ఈరోజు కుటుంబాన్ని వదిలేసి తిరిగిరాని లోకానికి వెళ్లిపోయిందంటూ తీవ్ర భావోద్వేగానికి డెన్నిస్ ట్రోపర్ గురయ్యారు.

Read Also: Varun Tej Matka : వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్ కి డేట్, టైం ఫిక్స్

ఇక, యూఎస్‌కు చెందిన సుసాన్ 2014 నుంచి 2023 వరకు యూట్యూబ్‌ సీఈవోగా పని చేశారు. అంతకు ముందు ఆమె గూగుల్‌లో వర్క్ చేశారు. ఈ నేపథ్యంలో సుసాన్‌ మృతిపై తీవ్ర దిగ్భ్రాం వ్యక్తం చేశారు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్.. రెండు సంవత్సరాలు క్యాన్సర్‌తో పోరాడిన తన స్నేహితురాలు మరణించడం నమ్మశక్యంగా లేదని ఆయన చెప్పుకొచ్చారు. తను ఓ అద్భుతమైన వ్యక్తి.. ఆమె లేని ఈ ప్రపంచాన్ని ఊహించడం కష్టంగా ఉంది.. కాగా, గూగుల్‌లో సుసాన్‌ కీలక వ్యక్తిగా పని చేశారు. ఇంటర్నెట్‌ను రూపొందించడంలో సుసాన్ ముఖ్యపాత్ర పోషించారు అంటూ సుందర్ పిచాయ్ వెలడించారు.

Show comments