Site icon NTV Telugu

EV Prices: ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి గడ్కరీ గుడ్ న్యూస్..

Nithin

Nithin

EV Prices: ఢిల్లీలో 20వ FICCI ఉన్నత విద్యా సదస్సు 2025లో కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. రాబోయే 4 నుంచి 6 నెలల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధర పెట్రోల్ వెహికిల్స్ ధరకు సమానంగా మారతాయని తెలిపారు. మరో ఐదేళ్లలోపు, భారత్ లోని ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ 1గా మార్చడమే మా టార్గెట్ అన్నారు. నేను రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడూ ఇండియన్ ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.14 లక్షల కోట్లుగా ఉండేది.. ఇప్పుడు భారత ఆటోమొబైల్ పరిశ్రమ పరిమాణం రూ.22 లక్షల కోట్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ విలువ రూ.78 లక్షల కోట్లు ఉందని అంచనా వేయగా, చైనా రూ.47 లక్షల కోట్లు, భారత్‌ రూ.22 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

Read Also: Tariffs: ఇంపోర్టెడ్ మీడియం, హెవీ ట్రక్కులపై 25% సుంకం.. ప్రకటించిన ట్రంప్

అయితే, ఉదాహరణకు టాటా నెక్సాన్ పెట్రోల్ వేరియంట్‌ ఎక్స్-షోరూమ్ ధర రూ.731,890 నుంచి స్టార్ట్ అవుతుంది.. అదే సమయంలో టాటా నెక్సాన్ ఈవీ రూ.12.49 లక్షల నుంచి మొదలుకానుంది.. ఈ రెండు కార్ల మధ్య గణనీయమైన వ్యత్యాసాన్ని గమనించవచ్చు.. SUVలు, హ్యాచ్‌బ్యాక్‌లు, వాణిజ్య ఎలక్ట్రిక్ వాహనాలు లాంటి ఇతర విభాగాలలో కూడా ఇదే విధమైన ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది. సాంప్రదాయ ఇంధన వాహనాల కంటే ఈవీల ధరలు అధికంగా ఉంటాయి. కానీ, తాజాగా నితిన్ గడ్కరీ చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గే అవకాశం ఉంది.

Exit mobile version