X Platform Penalty: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X పై యూరోపియన్ యూనియన్ (EU) రూ.1080 కోట్ల జరిమానా విధించింది. డిజిటల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఈయూ ఈ చర్య తీసుకుంది. EU డిజిటల్ సర్వీసెస్ యాక్ట్ (DSA) ను ఉల్లంఘించినందుకు X కు 120 మిలియన్ యూరోలు లేదా సుమారు రూ.1,080 కోట్లు జరిమానా విధించింది. యూరోపియన్ కమిషన్ ప్రకారం.. X ప్లాట్‌ఫామ్ పారదర్శకత, వినియోగదారు రక్షణకు సంబంధించిన మూడు కీలక నియమాలను ఉల్లంఘించింది, ఇది బ్లూ టిక్ మార్క్, ప్రకటనల డేటాబేస్ విషయంలో వినియోగదారులను తప్పుదారి పట్టించి ఉండవచ్చని అని ఈయూ పేర్కొంది.
READ ALSO: Eros – Akhanda 2 : ఈరోస్ అఖండ 2నే ఎందుకు టార్గెట్ చేసిందో తెలుసా?
DSAలో నిర్దేశించిన పారదర్శకత ప్రమాణాలకు X అనుగుణంగా లేదని EU పేర్కొంది. DSA ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించవచ్చని కూడా కమిషన్ స్పష్టం చేసింది. EU నివేదికల ప్రకారం.. X లో ఉన్న నీలిరంగు చెక్‌మార్క్‌లు వినియోగదారులను తప్పుదారి పట్టించడానికి రూపొందించారు. ఇది స్కామ్‌లు, నకిలీ ఖాతాల తారుమారు ప్రమాదాన్ని పెంచుతుంది. కమిషన్ దీనిని మోసపూరిత డిజైన్‌గా అభివర్ణించింది. ఇది ఆన్‌లైన్ భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తుందని EU పేర్కొంది. ప్లాట్‌ఫారమ్‌లు తమ అన్ని ప్రకటనల డేటాబేస్‌ను ఈయూకు అందించాలి, ప్రకటనలను ఎవరు ఇస్తున్నారు, వారి టార్గె్ట్ ఆడియన్స్, ప్రకటనదారుల ఉద్దేశ్యం గురించి స్పష్టమైన సమాచారంతో సహా అన్ని వివరాలు ఇవ్వాల్సి ఉంది. అయితే X డేటాబేస్‌కు అందజేస్తున్న సమాచారం అసంపూర్ణంగా ఉందని ఈయూ కమిషన్ గుర్తించింది.
X ప్లాట్‌ఫామ్ పరిశోధకులు డేటాను యాక్సెస్ చేయడానికి “అనవసరమైన అడ్డంకులను” సృష్టిస్తుందని ఈయూ దర్యాప్తులో వెల్లడైంది. ఈ చర్య పారదర్శకత, ప్రజా ప్రయోజనాల స్ఫూర్తికి విరుద్ధమని EU చెబుతోంది. మోసం, ప్రకటనల అణచివేత, పరిశోధనకు ఆటంకం కలిగించడం యూరోపియన్ డిజిటల్ చట్టం ప్రకారం ఆమోదయోగ్యం కాదని EU ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
READ ALSO: Kasuri – Masood: జైషే అగ్ర కమాండర్ల ‘రహస్య సమావేశం’.. భారత్‌పై భారీ కుట్రకు ప్లాన్!
